Boy Falls Into Well : షాకింగ్ వీడియో.. ఆడుకుంటూ బావిలో పడిపోయిన బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.

Boy Falls Into Well : షాకింగ్ వీడియో.. ఆడుకుంటూ బావిలో పడిపోయిన బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Updated On : December 22, 2022 / 7:42 PM IST

Boy Falls Into Well : ఒక్కోసారి మనం ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. రెప్పపాటులో ప్రమాదాల బారిన పడుతుంటాం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. లక్ ఉంటే సేఫ్ గా బయటపడొచ్చు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అర్నవ్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడే ఓ బావి ఉంది. దానిపై నెట్ కప్పి ఉంచారు. అటుగా వచ్చిన బాలుడు అర్నవ్.. పొరపాటున నెట్ పై కాలు పెట్టాడు. అంతే, నెట్ తెగిపోయింది. బాలుడు బావిలో పడిపోయాడు. అక్కడే సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న మరో చిన్నారి ఇదంతా కళ్లారా చూశాడు.

Also Read..Shocking Video : షాకింగ్ వీడియో.. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్, పిల్లాడు చేసిన పనికి స్కూటీ పైనుంచి ఎగిరిపడ్డ తండ్రి

ఆ పిల్లాడు బాగా భయపడ్డాడు. గట్టి గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. అర్నవ్ బావిలో పడిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. వారు వెంటనే బావి దగ్గరికి చేరుకున్నారు. లోపల అర్నవ్ ను చూసి కంగారు పడ్డారు. ఓ వ్యక్తి బావిలోకి దిగి బాలుడిని బయటకు తీసి కాపాడాడు. 3 నిమిషాల వ్యవధిలోనే బాబుని బయటక తీయగలిగారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బాబు ఆడుకుంటూ బావిలో పడిన దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read..Bull Attack : ఘోరం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు దాడి, కొమ్ములతో పొడిచి పొడిచి చంపేసింది, వీడియో వైరల్

ఆ బావి 40 అడుగుల లోతు ఉంది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి నిమిషాల వ్యవధిలో బాబుని కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఘోరం జరిగిపోయేది. వెంటనే ఓ తాడుని బావిలోకి వేసి ఆ తాడుని పట్టుకోవాలని అర్నవ్ కి చెప్పారు. ఆ తర్వాత ఓ వ్యక్తి బావిలోకి దిగి బాబుని బయటకు తీశాడు. ఎలాంటి గాయాలు అవకుండా బాబు క్షేమంగా బావి నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, ఇంటి ఆవరణలో బావులు, సంపులు, నీటి గుంతలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని భద్రంగా కప్పి ఉంచాలి. తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.