Sitaram Yechurys Health : విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆగస్టు 19న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో

Sitaram Yechurys Health : విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

sitaram yechurys

Sitaram Yechury Health condition : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆగస్టు 19న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేరారు. అప్పటి నుంచి డాక్టర్లు వెంటిలేటర్ పైనే ఏచూరికి వైద్యం అందిస్తున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ సహా ఇతర అనారోగ్య సమస్యలతో ఏచూరి బాధపడుతున్నారు. అయితే.. ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ నేతలు కొద్దిరోజుల క్రితం వెల్లడించింది.

తాజాగా.. పార్టీ కేంద్ర కార్యాలయం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వెంటిలేటర్ సపోర్ట్ తో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం ఆయనకు వైద్యం అందిస్తున్నారని పేర్కొంది.

సీతారాం ఏచూరి త్వరగా కోలుకోవాలి: నారాయణ
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సీతారాం ఏచూరి. వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్. ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి.. ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారని నారాయణ అన్నారు.

Also Read : హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సడెన్ బదిలీ వెనుక అసలు కారణమేంటి..?