ప్రమాదంలో భారత్.. కమ్యునిటీ ట్రాన్స్మిషన్.. గ్రామాల్లో కరోనా నియంత్రిణ అసాధ్యం.. : IMA

  • Published By: vamsi ,Published On : July 20, 2020 / 08:00 AM IST
ప్రమాదంలో భారత్.. కమ్యునిటీ ట్రాన్స్మిషన్.. గ్రామాల్లో కరోనా నియంత్రిణ అసాధ్యం.. : IMA

Updated On : July 20, 2020 / 10:45 AM IST

దేశంలో కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మరణాల గ్రాఫ్ కూడా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దేశంలో కరోనా కారణంగా పరిస్థితి చెయ్యి దాటి పోతుందని, వైద్యుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్( సమాజ వ్యాప్తి) ప్రాంభం అయ్యిందని ఐఎంఎ తెలిపింది. దీనితో దేశంలో పరిస్థితులు చాలా ఘోరంగా మారాయని ఐఎంఎ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, అత్యధిక కేసుల విషయంలో భారతదేశం మూడవ స్థానంలో ఉందని, IMA (హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు డాక్టర్ వి.కె.మోంగా వెల్లడించారు. “కరోనా ఇప్పుడు భయంకరమైన వేగంతో పెరుగుతోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య 30వేలకు పైగా వస్తున్నాయి. దేశంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి:
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే విషయమని, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి గురించి ఐఎంఎ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు డాక్టర్ వి.కె.మోంగా అన్నారు. దీనికి చాలా అంశాలు సంబంధం కలిగి ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి వేగంగా ఉందని, ఇది మంచి సంకేతం కాదని, కరోనా కమ్యూనిటీ వ్యాప్తి దేశంలో ప్రారంభమైందనడానికి ఇదే కారణం అని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి కరోనా సోకగా.. కొత్తగా 2.18 లక్షలు మందికి కరోనా సోకింది, 24 గంటల్లో ప్రపంచంలో 4 వేల మంది చనిపోయారు. పట్టణాలు మరియు గ్రామాలలో కరోనా వైరస్‌ను నియంత్రించడం ప్రభుత్వానికి కష్టమవుతుందని డాక్టర్ మోంగా హెచ్చరించారు. ఢిల్లీలో మేము దానిని ఆపగలిగాము, కాని మహారాష్ట్ర, కేరళ, గోవా, మధ్యప్రదేశ్‌లలో దేశంలోని అంతర్గత ప్రాంతాలకు ఏమి జరుగుతుంది? అనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నట్లు చెప్పారు.

మరింత పెరగనున్న వేగం:
కరోనా వైరస్ సంక్రమణ కేసులు రుతుపవనాలు రాకతో మరింత పెరగనున్నాయి. చలిలో వేగం పెరగనున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. IIT- భువనేశ్వర్ మరియు ఎయిమ్స్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో రుతుపవనాలు రాకతో చలిలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కరోనా సంక్రమణ కేసులు విపరీతంగా పెరుగుతాయని తేలింది. ఐఐటి-భువనేశ్వర్ స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్ అండ్ క్లైమేట్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి వినోజ్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, కరోనా సంక్రమణ వ్యాప్తికి వర్షం, ఉష్ణోగ్రత తగ్గడం మరియు చల్లని వాతావరణం అనుకూలంగా మారవచ్చనని చెబుతుంది.