Six Children Escaped : రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్

రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు.

Six Children Escaped : రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్

six children escaped

Updated On : December 14, 2022 / 11:31 PM IST

Six Children Escaped : రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు ఆ కేంద్రం గోడకు కన్నం పెట్టి అందులో నుంచి బయటకు వచ్చారు.

పారిపోయేందుకు ప్రయత్నించంగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆరుగురు బాలా నేరస్థులు సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది జువైనల్ హోమ్ కు చేరుకున్నారు. ఈ కేంద్రం గోడకు కన్నం ఉండటాన్ని గమనించారు.

Gang Rape: పదో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితులంతా మైనర్లే

ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలిపారు. పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి తప్పించుకున్న ఆరుగురు పిల్లలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రిఫార్మ్ హోమ్ లో భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు చేపట్టారు.