Uttar Pradesh : ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..
Uttar Pradesh : యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
Old House Collapses in Uttar Pradesh
Uttar Pradesh : యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read : Donald Trump : ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. దర్యాప్తు చేపట్టిన ఎఫ్ఏఏ.. అసలేం జరిగిందంటే?
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారు జామున 3గంటల సమయంలో శిథిలావస్థలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. మృతుల్లో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ (60), ఆయన భార్య రీతా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23)లతోపాటు ఆమె ఇద్దరు చిన్న కుమారుడు మాధవ్ (2 ఏళ్లు), అద్విక్ (4 నెలలు) ఉన్నారు.
ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అయితే, అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 28ఏళ్ల వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. అతన్నిచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా పురాతన భవనం పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆధిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయపడిన వ్యక్తి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
