భారత్‌లో 6వ కరోనా మరణం, 38ఏళ్ల వ్యక్తి మృతి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 6కి పెరిగింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ… రెండు కరోనా మరణాలు బయటపడ్డాయి. పాట్నాలో 38ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. బీహార్ రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం. ఇప్పటివరకు చనిపోయిన వారంతా వృద్దులే. కానీ ఫస్ట్ టైమ్ 38ఏళ్ల వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా కేసుల్లో వృద్ధులు మాత్రమే చనిపోతారని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. అందుకు భిన్నంగా పాట్నాలో జరిగింది.
పాట్నాలో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయాడని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారమే(మార్చి 21,2020) అతడు చనిపోయినట్టు వెల్లడించారు. బతికి ఉన్నప్పుడు చేసిన టెస్టులకు సంబంధించి ఆదివారం రిపోర్టు వచ్చింది. కరోనాతో అతడు చనిపోయినట్టు రిపోర్టులో తేలింది. మృతుడు కొన్ని రోజుల క్రితమే ఖతార్ నుంచి పాట్నా వచ్చినట్టు సమాచారం. కొన్ని రోజులు ఎయిమ్స్ లో చికిత్స కూడా తీసుకున్నాడు. శనివారం ఉదయం చనిపోయాడు. బాధితుడి కిడ్నీ ఫెయిల్ అయినట్టు డాక్టర్లు చెప్పారు. అతడు మంగర్ వాసి అని, ఖతార్ నుంచి రెండు రోజుల క్రితం కోల్ కతా వచ్చాడని, అక్కడి నుంచి బీహార్ వచ్చాడని వివరించారు. కాగా, ఆదివారం(మార్చి 22,2020) ముంబైలో 63ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఇది దేశంలో 5వ మరణం కాగా, ముంబైలో రెండవది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే పాట్నాలో కరోనా మరణం బయటకు వచ్చింది.
మరోవైపు మహారాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం(మార్చి 22,2020) ఒక్క రోజే మహారాష్ట్రలో 10 కరోనా (ముంబైలో 6, పుణెలో 4) కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 74కి పెరిగింది. కాగా వీరిలో కొందరు ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. విదేశాలకు వెళ్లకపోయినా కరోనా వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటగా కర్నాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఆ తర్వాత ఢిల్లీలో ఒకరు కరోనాతో చనిపోయారు. మార్చి 17న ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 64ఏళ్ల వృద్ధుడు కరోనా మరణించాడు. ఆ తర్వాత పంజాబ్ లో 79ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. తాజాగా మహారాష్ట్రలో(ముంబై) 5వ కరోనా మరణం, బీహార్ లో(పాట్నా) 6వ కరోనా మరణం చోటు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 6వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13వేల 17మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇటలీలో ఒక్క రోజే 793 మంది చరిపోయారు. ఇటలీలో ఇప్పటివరకు కరోనాతో 4వేల 825మంది మరణించారు.
కరోనా భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. ఆరుగురు చనిపోయారు. 30 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
వైరస్ ఎప్పుడు ఎలా సోకుతుంది అనేది తెలియడం లేదు. లక్షణాలు బయటపడిన తర్వాతే వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అయితే వైరస్ బారినపడ్డట్టు తెలియడానికి 14 రోజుల సమయం పడుతోంది. అది తెలిసేలోపు పరిస్థితి విషమిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ చేస్తున్నాయి. ఇప్పటికే ముంబై, నాగ్ పూర్ లాక్ డౌన్ కాగా, తాజాగా రాజస్తాన్, పంజాబ్ లో మార్చి 31వరకు షట్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు.