నోరెళ్లబెట్టిన స్టార్ హీరోయిన్‌ : సంజీవిని పర్వతాన్ని హనుమ ఎవరి కోసం తెచ్చాడు

నోరెళ్లబెట్టిన స్టార్ హీరోయిన్‌ : సంజీవిని పర్వతాన్ని హనుమ ఎవరి కోసం తెచ్చాడు

Updated On : September 21, 2019 / 10:50 AM IST

సాయం చేయాలని వచ్చి తన మట్టి బుర్రతో అడ్డంగా దొరికిపోయింది స్టార్ హీరోయిన్.. రాజస్థాన్‍‌లోని ఎన్జీవో వర్కర్ రుమాదేవీ కరమ్‌వీర్ కంటెస్టంట్‌గా కౌన్ బనేగా కరోర్‌పతి( మీలో ఎవరు కోటీశ్వరుడు) టీవీ కార్యక్రమంలో ఆడేందుకు వచ్చింది. అంత పెద్ద హీరోయిన్ వచ్చిందనుకుని సింపుల్ క్వశ్చన్ ఇచ్చారో..  ఈ ప్రశ్నకైనా సమాధానం తెలుసోలేదో అని పరీక్షించాలనుకున్నారో అడిగిన ప్రశ్నకు కళ్లు తేల్చేసి లైఫ్ లైన్ వాడుకుంది. 

ఆమెవరో తెలుసా.. ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శతృఘ్నసిన్హా కూతురు. ఎవరో అర్థం అయ్యింది కదా.. సోనాక్షి సిన్హా.  ఈ అందమైన బొద్దుగుమ్మ కోట్ల మంది ఫ్యాన్ ను సంపాదించుకుంది. దేశభక్తితోపాటు దేవుడంటే ఎంతో ప్రేమానురాగాలు చూపించే హీరోయిన్ సోనాక్షిని నెటిజన్లు రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన మంగళయాన్ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో నటించిన సోనాక్షికి ఈ సమాధానం కూడా తెలియదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

KBCలో ఆమెని అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా..
ప్రశ్న : రామాయణంలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎవరి కోసం తీసుకొచ్చాడు?
ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. సుగ్రీవ్, లక్ష్మణ్, సీత, రాముడు అనే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ప్రశ్నకు హీరోయిన్ సోనాక్షి సిన్హా సమాధానం కోసం తలపట్టుకుంది. రామ్ కోసం అని కొద్దిసేపు, సీత కోసం అని మరికొంత సేపు డైలమాలో పడింది. ఎలాగైనా ఆన్సర్ చేయాలని ఉద్దేశ్యంతో 4లైఫ్ లైన్లలో చివరిది కూడా వాడేసింది. ఆడియన్స్ పోల్ ద్వారా అసలు సమాదానం చెప్పింది. దీనిపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. ఏ మాత్రం అవగాహన లేదా రామాయణంపై అంటూ తిట్టిపోస్తున్నారు. 

ఇంకో విశేషం ఏంటంటే.. సోనాక్షి సిన్హా ఇంటికి పెట్టిన పేరు రామాయణ్. హీరోయిన్ సోదరుల పేర్లు లవ్, కుశ్. ఇంటిళ్లపాది రామాయణంతో నిండిపోయింది. తండ్రి బీజేపీ కేంద్ర మాజీ మంత్రి. ఇంట్లోనే రామాయణం చరిత్రనే పెట్టుకున్న ఈ బ్యూటీకి.. రామాయణంలోని కీలక ఘట్టం తెలియకపోవటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. 

వేలాది ట్విట్లతో సోనాక్షి సిన్హాకు చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడప్పుడు మేకప్ తోపాటు.. పుస్తకాలు కూడా చదవాలంటున్నారు. ఇంటికి, పిల్లలకు రామాయణం పేర్లు పెట్టటం కాదు.. రామాయణం గురించి కూడా కొంచెం చెప్పాలంటూ శతృఘ్నసిన్హాను కార్నర్ చేసి.. టార్గెట్ పెట్టి ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.