ఇందిరా గాంధీ సంప్రదాయం : హోమం చేసిన సోనియా గాంధీ

భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి.

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 03:07 AM IST
ఇందిరా గాంధీ సంప్రదాయం : హోమం చేసిన సోనియా గాంధీ

Updated On : April 12, 2019 / 3:07 AM IST

భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి.

భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు సెంటిమెంట్లు పాటిస్తున్నారు.
Read Also : JEE Advanced : 2 లక్షల 45వేల మందికి అవకాశం

కొంతమంది గుళ్లోకి వెళ్లి పూజలు చేయడం..హోమాలు, యాగాలు చేయడం చేస్తున్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. అత్త ఇందిర నెలకొల్పిన సంప్రదాయాన్ని ఆమె కొనసాగించారు. రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ల పత్రాలను ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఆమె ఎన్నికల అధికారులకు సమర్పించారు. అంతకంటే ముందు అత్త ఇందిరాగాంధీ 52 ఏళ్ల క్రితం నెలకొల్పిన సంప్రదాయాన్ని సోనియా కొనసాగించారు. 1967లో ఇందిర తొలిసారి పోటీ చేసినప్పుడు తన ఎన్నికల ప్రతినిధిగా ఉన్న గయా ప్రసాద్ ఇంట్లో హోం నిర్వహించారు.

తరువాత నామినేషన్లను సమర్పించారు. సోనియా గాంధీ కూడా గురువారం ఆ ఇంట్లోనే హోమం జరిపించారు. ఈ హోమం కార్యక్రమంలో కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 
Read Also : సినిమా ఆపుతారా : మమత సర్కార్‌కు రూ. 20 లక్షల ఫైన్