Sonali Sood : రోడ్డు ప్రమాదంలో సోనూసూద్ భార్యకు గాయాలు.. కారుని ఢీకొట్టిన ట్రక్కు

వెంటనే సోనాలి సూద్ ను నాగ్ పూర్ లోని మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Sonali Sood : రోడ్డు ప్రమాదంలో సోనూసూద్ భార్యకు గాయాలు.. కారుని ఢీకొట్టిన ట్రక్కు

Updated On : March 25, 2025 / 4:52 PM IST

Sonali Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది.

ముంబై నాగ్ పూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ లోని వార్దా రోడ్ లో ఫైఓవర్ పై సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వెంటనే సోనాలి సూద్ ను నాగ్ పూర్ లోని మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో సోనాలి సూద్ తో పాటు ఆమె సోదరి, సోదరి కుమారుడు ఉన్నారు. వారు కూడా గాయపడ్డారు.

Also Read : మార్చి 31 వచ్చేస్తోంది.. ఫైన్‌ నుంచి తప్పించుకోవాలన్నా.. పన్ను ప్రయోజనాలు పొందాలన్నా వెంటనే ఇలా చేయండి..

 

విషయం తెలిసిన వెంటనే సోనూసూద్ నాగ్ పూర్ చేరుకున్నారు. ప్రస్తుతం నా భార్యకు బాగానే ఉంది. తృటిలో ఘోరం తప్పింది. ఓం సాయి రామ్ అని సోనూసూద్ అన్నారు. సోనాలి సూద్ నాగ్ పూర్ మ్యాక్స్ ఆసుపత్రిలో డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నారు. సోనాలి సూద్ సోదరికి స్వల్వ గాయాలయ్యాయి. ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.