ఎస్పీ క్వశ్చన్ : ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయా

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్‌సోర్సింగ్‌లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈబీసీ బిల్లుకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలుపుతూనే పలు ప్రశ్నలు సంధించింది. 98శాతం ఉన్న పేదలకు.. కేవలం 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఏంటని నిలదీశారు.
* పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో.. జనరల్ కోటాలో దళితులు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినా, వారిని రిజర్వేషన్ కోటాకే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు
* ఇప్పటివరకు రిజర్వేషన్ పొందిన వారి స్థితిగతులు ఏమైనా మారాయా?
* దళితుల్లో క్లాస్ వన్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు
* మీడియాలో కేవలం మూడు శాతం మంది మాత్రమే దళితులు ఉన్నారు
* జనాభా ప్రతిపాదికన ఓబీసీ రిజర్వేషన్లు 54 శాతానికి పెంచాలి