అమ్మతోడు.. దేశంలో కొత్త ఉద్యమం : పెళ్లి ఓకే.. పిల్లలను కనం

పిల్లల అంగీకారం లేకుండా వారిని కనే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఓ ఉద్యమం పుట్టుకొచ్చింది. చైల్డ్ ఫ్రీ మూవెంట్ పేరుతో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ఉదృత్తం చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : February 13, 2019 / 08:36 AM IST
అమ్మతోడు.. దేశంలో కొత్త ఉద్యమం : పెళ్లి ఓకే.. పిల్లలను కనం

పిల్లల అంగీకారం లేకుండా వారిని కనే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఓ ఉద్యమం పుట్టుకొచ్చింది. చైల్డ్ ఫ్రీ మూవెంట్ పేరుతో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ఉదృత్తం చేస్తున్నారు.

పిల్లల అంగీకారం లేకుండా వారిని కనే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఓ ఉద్యమం పుట్టుకొచ్చింది. చైల్డ్ ఫ్రీ మూవెంట్ పేరుతో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ఉధృత్తం చేస్తున్నారు. వాలంటరీ హ్యుమన్ ఎగ్జిటెన్స్ మూవెంట్ (VHEM)యాంటి నాటలిజం గ్రూపుగా ఏర్పడిన కొందరు సామాజిక కార్యకర్తలు  పెద్దఎత్తున ఈ ఉద్యమానికి తెరలేపారు. పిల్లలను కనడం మానేయండి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పిల్లలను పుట్టించడం పెద్ద తప్పుగా వీళ్లు విశ్వసిస్తున్నారు. అంతేకాదు.. పుట్టిన పిల్లలు పెరిగి భూగ్రహానికి హాని తలపెడుతున్నారని వాదిస్తున్నారు. ఈ వాదనపై వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొందరు మాత్రం వీరిఅభిప్రాయాలను సమర్థించడం గమనార్హం.

ఈ ఉద్యమంలో పాల్గొనేవారు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చునని, అహింసవాదంతో నడిచే ఉద్యమంటూ ‘చైల్డ్ ఫ్రీ ఇండియా’ పై అందరిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ వ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు ఈ ఉద్యమాన్ని నడిపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు దేశంలోనే తొలిసారి ఫిబ్రవరి 10న బెంగళూరులోని మంత్రి స్వ్యేర్ మాల్ లో యాంటి నాటలిజం  గ్రూపు సభ్యులంతా సమావేశమయ్యారు.

చైల్డ్ ఫ్రీ ఇండియా ఎందుకంటే..

ఈ ఉద్యమానికి మాంత్రి స్వ్కెయిర్ నిర్వాహకుడిగా ఉండి.. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. యాంటి నాటలిజం గ్రూపు ఉద్యమ నేతల్లో ఒకరైన ప్రతిమా నాయక్ అనే మహిళ చైల్డ్ ఫ్రీ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఉద్యమం పూర్తిగా స్వచ్చందం. అహింసవాద ఉద్యమం. మా నమ్మకాలను మరొకరిపై రుద్దాలనే ఉద్దేశం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను కనడం ఎంతవరకు సబబు అనే ఆలోచన ప్రతిఒక్కరిలో రావాలన్నదే మా ఆకాంక్ష’ అని చెప్పారు. అందుకే చైల్డ్ ఫ్రీ సొసైటీ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చైల్డ్ ప్రీ లైవ్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లలకు వ్యతిరేకం కాదు.. పిల్లలను కనడంపైనే మా పోరాటం అనే నినదిస్తూ ముందుకు కదిలారు. యాంటి నాటలిజం ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ప్రతిమా ఎన్నో నగరాలను చుట్టి వచ్చారు. చైల్డ్ ఫ్రీ ఎందుకు కావాలో అందరిలో అవగాహన కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు. 

పిల్లల్ని కనొద్దు.. దత్తత ముద్దు
భారత జనాభాలో రోజుకో కొన్నివేల జననాలు జరుగుతున్నాయి. ఇండియాలో 20 లక్షల మంది అనాథ పిల్లలు తల్లిదండ్రుల ఆలనపాలన కోసం ఎదురుచూస్తున్నారని, పిల్లలను కనే బదులు వారిని దత్తత తీసుకోవడం ఎంతో ఉత్తమమని ప్రతిమ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమం పేరు వింటే.. కొత్తగా అనిపించినా.. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ వాదనను వినిపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం దీనిపై ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని, పిల్లలను కనడం మానితే అది మానవాళికే ఎంతో మంచిదని అంటున్నారు. భారత్ లో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, పిల్లలను కంటూ వెళితే.. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్, ఆర్థిక సంక్షోభం వంటి ఎన్నో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

సింగిల్స్ చైల్డ్ పాలసీ ఉత్తమం
ఫ్రీలాన్స్ బ్రాండ్ కన్సల్టెంట్ అనుగ్రహ కుమార్ శర్మ మాట్లాడుతూ… పిల్లలు కనొద్దు అనే నిర్ణయం తీసుకోవడం ఎంత గొప్ప పని అంటున్నారు. లేదు.. అంతగా పిల్లలు కావాలనుకుంటే.. సింగిల్ చైల్డ్ పాలసీకి కట్టుబడి ఉంటే మరి మంచిదంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఒక్క చైనా దేశంలోనే జనాభా ఎక్కువ అని అందరికి తెలుసు. అందుకే అక్కడ సింగిల్ చైల్డ్ పాలసీని అమల్లోకి తెచ్చారు. ఆ దేశంలో జనాభాను నియత్రించేందుకు అక్కడి ప్రభుత్వం ఒక బిడ్డ చాలు అనే రూల్ ను అమల్లోకి తెచ్చింది. ఇదే తరహాలో ఎవరికి వారే పిల్లలు కనొద్దనే నిర్ణయానికి వస్తే బాగుంటుందని యాంటి నాటలిజం కార్యకర్తలు భావిస్తున్నారు.  

నన్నెందుకు కన్నారు.. తల్లిదండ్రులపైనే దావా
రాఫెల్‌ శామ్యూల్‌(27) అనే యవకుడు యాంటి నాటలిజాన్ని బలంగా నమ్మే వ్యక్తి. ఇటీవల యాంటి నాటలిజానికి మద్దతుగా ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పాపులర్ అయ్యాడు. అంతేకాదు.. తన అనుమతి లేకుండా ఎందుకు జన్మనిచ్చారని తల్లిదండ్రులపై దావా వేసేందుకు సిద్దమయ్యాడు. పిల్లలు కనడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. పిల్లలను కనడం వల్ల వారు పెరిగి భూమిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. బిడ్డలకు జన్మనివ్వడం తప్పంటు లెక్చర్లు ఇస్తున్నాడు. పిల్లలను ఈ భూమి మీదకు బలవంతంగా తీసుకురావడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. తన అనుమతి లేకుండా భూమి మీద కన్న తల్లిదండ్రులు తన జీవితానికి వెల కట్టాల్సిందిగా చెబుతున్నాడు. తల్లిదండ్రులకు తనకు మధ్య మంచి అనుబంధమే ఉన్నా.. సరే, తల్లిదండ్రులు వారి ఆనందం కోసం మాత్రమే పిల్లలకు జన్మనిస్తారని చెబుతాడు.

Also Read: బుర్రకి పైత్యం వస్తే : నన్నెందుకు కన్నారు అంటూ కోర్టుకెళ్లిన కొడుకు