Guinness World Record : 5 రోజులు ఆపకుండా కథక్ నృత్యం చేసి వరల్డ్ రికార్డ్ సాధించిన విద్యార్ధిని
5 రోజులు .. 127 గంటల పాటు ఆపకుండా నృత్యం చేయడమంటే మామూలు విషయం కాదు. సృష్టి సుధీర్ జగ్తాప్ అనే 16 సంవత్సరాల విద్యార్ధిని అనుకున్నది సాధించింది. కథక్ డ్యాన్స్ ఆపకుండా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.

Guinness World Record
Guinness World Record : ఐదురోజులు.. 127 గంటలు.. నాన్ స్టాప్ డ్యాన్స్ చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది 16 సంవత్సరాల అమ్మాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది.
Guinness World Records: 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన శివ నారాయణ్ జ్యువెలర్స్
భారతదేశానికి చెందిన సృష్టి సుధీర్ జగ్తాప్ అనే 16 ఏళ్ల విద్యార్ధిని డ్యాన్స్‌లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. మే 29 ఉదయం డ్యాన్స్ ప్రారంభించిన ఆమె జూన్ 3 వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంది. భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆమె కథక్‌ను నాట్యాన్ని ప్రదర్శించింది. డ్యాన్స్ ద్వారా దేశానికి ప్రాతినిథ్యం వహించడం తన కల అని సృష్టి చెప్పింది. ఈ ఫీట్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు 6 నెలల కఠినమైన శిక్షణ తీసుకుందట. రోజూ 4 గంటల వరకు గైడెడ్ మెడిటేషన్, ఆరు గంటల డ్యాన్స్ ప్రాక్టీస్ మరియు మూడు గంటల పాటు వ్యాయామాలు చేసిందట. రాత్రి 10 గంటలకు నిద్రపోవడం.. తెల్లవారు ఝామున మూడు గంటలకు నిద్ర లేవడం దినచర్యగా నియమాలను పాటించిందట.
సృష్టి యొక్క ఫీట్‌ను GWR అధికారిక న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగారికర్ పర్యవేక్షించారు. ఆమె అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శించిందని కితాబు ఇచ్చారు. నాన్ స్టాప్‌గా డ్యాన్స్ చేయడానికి ఆమె తీసుకున్న ఛాలెంజ్ మొదట నమ్మశక్యం కాలేదని ఆ తరువాత గిన్నిస్ బుక్ నియమాలను అనుసరిస్తూ ఆమె రికార్డును సొంతం చేసుకుందని స్వప్నిల్ దంగారికర్ తెలిపారు.