Vaccine Zycov-D : దేశంలో మరో వ్యాక్సిన్.. తొలి సూది రహిత టీకా
దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సూది రహిత టీకాగా గుర్తింపు పొందిన జైడస్ క్యాడిలా టీకా జైకోవ్-Dకి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అనుమతిచ్చింది.

Zycov D
first injection-free vaccine Zycov-D : దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సూది రహిత టీకాగా గుర్తింపు పొందిన జైడస్ క్యాడిలా టీకా జైకోవ్-Dకి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అనుమతిచ్చింది. జైకోవ్-D అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. మూడు డోసుల్లో ఈ వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది.
తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా జైకోవ్-డీ నిలవనుంది. అంతేకాదు దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా కూడా ఇదే.
గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా దేశ వ్యాప్తంగా 28వేల మంది వాలంటరీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. జులై 1న అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ సామర్థ్యం 66.6శాతంగా తెలిపింది. 50 కేంద్రాల్లో జైడస్ ట్రయల్స్ జరిపింది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వెయ్యిమందిపై ట్రయల్స్ నిర్వహించిన తొలి వ్యాక్సిన్ ఇదే.
అలాగే ప్రపంచంలో వినియోగానికి అనుమతి పొంది తొలి DNA వ్యాక్సిన్ కూడా ఇదే. జైకోవ్‌కు అనుమతులతో దేశంలో మొత్తం ఐదు వ్యాక్సిన్లు అందుబాటులోస్తున్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వితోపాటు మోడెర్నా, జైకోవ్-డి టీకాలు ప్రజలకు పంపిణీ చేయనున్నారు. సూది రహిత వ్యాక్సిన్ కావడంతో జైకోవ్ సైడ్ ఎఫ్టెక్ట్స్‌ను తగ్గిస్తుందని జైడస్ క్యాడిలా తెలిపింది.