భర్త సమక్షంలో రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణం

తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి.

Sudha Murty Takes Oath As Rajya Sabha MP

Sudha Murty Takes Oath: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో ఆమె ప్రమాణం చేశారు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్.. ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యసభా నాయకుడు పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

73 ఏళ్ల సుధా మూర్తిని నరేంద్ర మోదీ సర్కారు రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ ప్రస్తుతించారు.

ఇన్ఫోసిస్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సుధా మూర్తి రచయిత్రిగానూ సుపరితులు. కన్నడ, ఇంగ్లీషులో పలు పుస్తకాలు రాశారు. ఆమె రాసిన వాటిలో చాలావరకు పిల్లల పుస్తకాలు ఉన్నాయి. సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) అవార్డులు కూడా ఆమెకు దక్కాయి. సుధా మూర్తి అల్లుడు రిషి సునక్‌ ప్రస్తుతం బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు.

Also Read: సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్.. ఏకంగా 67 మందికి మొండిచేయి!