Sukesh Chandrasekhar: త్వరలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్

2020లో హైదరాబాద్‌లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముడుపులు అందాయి. వాటితో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

Sukesh Chandrasekhar: త్వరలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar

Updated On : July 2, 2023 / 2:10 PM IST

Sukesh Chandrasekhar: మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మీడియాకు తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా మరో లేఖను విడుదల చేశాడు. ఢిల్లీ శాంతి భద్రతలపై మాట్లాడుతున్న సీఎం కేజ్రీవాల్, అతని సహచరులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. నా తల్లికి ఫోన్ చేసి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే జైలులో విషంపెట్టి నన్ను చంపేస్తామని కేజ్రీవాల్ సన్నిహితులు బెదిరించారని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు.

Sukesh Chandrasekhar: కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కొనుగోలుపై విచారణ జరపాలి: సుకేశ్ మరో లేఖ

కేజ్రీవాల్ దిగజారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని సుఖేష్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేజ్రీవాల్ ఇతరులను నిందించే ముందు తమనితాము చూసుకోవాలని సూచించాడు. త్వరలో కేజ్రీవాల్‌కూడా తీహార్ జైలులో చేరతారని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. హైదరాబాద్‌లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ముడుపులు అందాయని, 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

Sukesh Chandrasekhar : ఎమ్మెల్సీ కవితతో చాటింగ్..! సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలనం

వారంరోజుల క్రితం మూడు అపార్ట్‌మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టారని అన్నాడు. దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు లావాదేవీని చూపుతూ నాకు సత్యేందర్ జైన్‌కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్‌ను త్వరలో విడుదల చేస్తానని, వారంరోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.