Pegasus : పెగాసస్ పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపైన స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ పైన విచారణకు ఒకే చెప్పింది.

Pegasus : పెగాసస్ పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు

Pegasus

Updated On : July 30, 2021 / 11:19 AM IST

Pegasus : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపైన స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ పైన విచారణకు ఒకే చెప్పింది.

ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగాసస్ పై విచారణ చేపట్టనుంది.

ఇక పార్లమెంట్ లో దీనిపై రచ్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్చలేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే సభ అనేకసార్లు వాయిదా పడింది.