Sharad Pawar : చంపేస్తామంటూ శరద్ పవార్ కు బెదిరింపులు

శరద్ పవార్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.

Sharad Pawar : చంపేస్తామంటూ శరద్ పవార్ కు బెదిరింపులు

Sharad Pawar

Updated On : June 9, 2023 / 12:50 PM IST

threats for Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ శరద్ పవార్ ను బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని పార్టీ నేతలు ముంబై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

“పవార్ సాహెబ్ కోసం నా వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది. లఅది బెదిరింపు సందేశం. ఓ వెబ్ సైట్ ద్వారా నా తండ్రి పవార్ ను బెదిరించారు” అని సుప్రియా సూలే పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ముంబై పోలీసు కమిషనర్ ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశానని చెప్పారు.

MP CM Ramesh : ఏపీలో అధికారంలోకి రానున్న బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వం : ఎంపీ సీఎం రమేష్

ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన సూలే.. చర్యలు తీసుకోవాలని కోరారు. శరద్ పవార్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.