Bangla
ATM Robbery: ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇటీవల జరిగిన ఓ ఎటిఎం చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఈఘటనలో ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని సహా కోల్‌కతాకు చెందిన మరో యువకుడిని భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సౌమేంద్ర ప్రియదర్శి..వార్త సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసు వివరాలు వెల్లడించారు. భువనేశ్వర్ నగర శివారులోని లింగిపూర్ హోసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకుకి చెందిన ఎటిఎంను ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 4న జరిగిన ఈ చోరీ ఘటనలో ఏటీఎంలోని రూ.20 లక్షలను దుండగులు కాజేశారు. అంతే కాదు చోరీ అనంతరం పారిపోయేందుకు నిందితులు స్థానికంగా ఒక ద్విచక్రవాహనాన్ని సైతం దొంగిలించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు..ఇద్దరు నిందితులను గుర్తించారు.
Also read:Rahul Gandhi: దేశంలో 40 లక్షల మంది మృతి చెందారు: కరోనా మరణాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
అనంతరం వారి సెల్ సిగ్నల్ ట్రేస్ చేయగా..ఇద్దరు నిందితులు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఇద్దరు నిందితులను భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ జాతీయుడు కాగా మరొకరు కోల్‌కతాకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన రూ.20 లక్షల సొమ్మును నిందితులు బంగ్లాదేశ్ కు తరలించారు. ఇంకా వీరి గ్యాంగ్ లో మరో నలుగురు బంగ్లాదేశీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి వీరు అక్రమ మార్గంలో భారత్ లోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటారు. అక్కడ ఏటీఎంలపై రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడుతారు. సాధారణంగా ఒక చోరీ అనంతరం తమ దేశానికి పారిపోయే నిందితులు ఈసారి బెంగళూరు చేరుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also read:Petrol Rates : వాహనాలు వద్దంటున్నారు.. కాళ్లకు పని చెబుతున్నారు
బెంగళూరులోనూ ఎటిఎం చోరీకి స్కెచ్ వేశారా? లేక మరేదైనా కార్యకలాపాలకు తెర లేపారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2020లోనూ గోవాలో ఇటివంటి ఘటనే చోటుచేసుకోగా..ముగ్గురు బంగ్లాదేశీయులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన సొమ్మును రికవరీ చేసుకునేందుకు భారత్ లోని బంగ్లాదేశ్ ఎంబసీకి సమాచారం ఇచ్చిన భువనేశ్వర్ పోలీసులు..ఆమేరకు ఇంటర్ పోల్ సహాయం కోరనున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చి నేరుగా ఈతరహా నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read:Trees Translocation: 100 ఏళ్ల నాటి 4 చెట్లను యధావిధిగా తరలించిన మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు