Rahul Gandhi: దేశంలో 40 లక్షల మంది మృతి చెందారు: కరోనా మరణాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది మృతి చెందారని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసత్య నివేదికలు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు

Rahul Gandhi: దేశంలో 40 లక్షల మంది మృతి చెందారు: కరోనా మరణాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul

Rahul Gandhi: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది మృతి చెందారని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసత్య నివేదికలు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ..బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనా సమయంలో దేశంలో సంబంవించిన మరణాల సంఖ్య వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ రాహుల్ అన్నారు. కేంద్రం చెబుతున్నట్టుగా కరోనా కారణంగా దేశంలో 5 లక్షల మంది మృతి చెందలేదని..40 లక్షల మంది మృతి చెందారని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని రాహుల్ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించకపోవడంతోనే అనేక మంది మృతి చెందారని ఆయన పేర్కొన్నారు.

Also read:Ice cream idly Video: ఇదేం టేస్ట్ రా నాయన: ఇడ్లీ సాంబార్ తో ఐస్ క్రీం రోల్స్

“మోదీ నిజాలు చెప్పారు, చెప్పనివ్వరు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని కేంద్రం చెబుతుంది. నేను ముందే చెప్పాను..కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 5 కాదు 40 లక్షల మంది భారతీయులు మృతి చెందారు. ఆయా మరణాలకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ కేంద్రం..ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి” అని రాహుల్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రపంచ కోవిడ్ మరణాలపై నివేదిక రూపొందిస్తున్న WHO ప్రయత్నాలకు భారత్ సహకరించడం లేదంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.

Also read:Punjab : ఢిల్లీ పర్యటన..మొన్న స్టాలిన్.. నేడు భగవంత్ మాన్

ఈసందర్భంగా ఆ కథనానికి సంబందించిన స్క్రీన్ షాట్‌ను రాహుల్ గాంధీ ట్విట్టర్లో పంచుకున్నారు. భారత దేశంలో COVID-19 మరణాలను అంచనా వేయడానికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుసరిస్తున్న పద్దతిపై భారత ప్రభుత్వం సందేహాలు లేవనెత్తింది. ఏ ప్రామాణిక ప్రాతిపదికను అనుసరించి గణనలను చేపడుతున్నారని WHO ప్రశ్నించిన భారత ప్రభుత్వం..భౌగోళిక పరిమాణం మరియు అత్యధిక జనాభా ఉన్న ఇంత విస్తారమైన దేశంలో ఆ ప్రామాణికాలు ద్వారా కరోనా మరణాలను అంచనా వేయడానికి వర్తించదని పేర్కొంది.

Also read:Raj Thackeray: చట్టం కంటే మతం పెద్దది కాదనే విషయాన్నీ ముస్లింలు గుర్తించాలన్నా రాజ్ థాకరే: మే 3 వరకు టార్గెట్