Raj Thackeray: చట్టం కంటే మతం పెద్దది కాదనే విషయాన్నీ ముస్లింలు గుర్తించాలన్నా రాజ్ థాకరే: మే 3 వరకు టార్గెట్

రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదివారం రాజ్ థాకరే స్పందిస్తూ..సంజయ్ రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

Raj Thackeray: చట్టం కంటే మతం పెద్దది కాదనే విషయాన్నీ ముస్లింలు గుర్తించాలన్నా రాజ్ థాకరే: మే 3 వరకు టార్గెట్

Loud

Raj Thackeray: మసీదులపై లోడ్ స్పీకర్ల తొలగింపు విషయంలో మహారాష్ట్రలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ..రాజ్ థాకరేను హిందూ ఓవైసీ అంటూ సంభోదించారు. కొందరు వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీకి రాజకీయంగా లబ్ది చేకూర్చే పనిలో ఉన్నారంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదివారం రాజ్ థాకరే స్పందిస్తూ..సంజయ్ రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

Also Read:Honour Killing : యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య ?

ఆ మాటకొస్తే మహారాష్ట్రలో అల్లర్లు సృష్టించాలని తాము కోరుకోవడంలేదన్న రాజ్ థాకరే..రాష్ట్రంలో ప్రజలు నిర్వహించే ఏ విధమైనటువంటి ప్రార్థనలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మసీదుల్లో ప్రార్థనలపై తమకు అభ్యంతరం లేదని..అయితే వారు(ముస్లింలు) లౌడ్ స్పీకర్లు వినియోగిస్తే మేము కూడా మసీదుల ఎదుట లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తామని అన్నారు. అయితే ప్రార్ధనామందిరాల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపు చట్టం పరిధిలోకి వస్తే ఎవరైనా సరే ఆ చట్టాన్ని గౌరవించాలని రాజ్ థాకరే అన్నారు. చట్టం కంటే మతం పెద్దది కాదనే విషయాన్ని ముస్లింలు గుర్తించాలని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. మే 3 తరువాత ఈ అంశంపై తమ విధివిధానాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Also read:UP CM Yogi Adityanath: సీఎం యోగిని కలుసుకునేందుకు 200 కి.మీలు పరుగెత్తుకొచ్చిన 10 ఏళ్ల చిన్నారి