UP CM Yogi Adityanath: సీఎం యోగిని కలుసుకునేందుకు 200 కి.మీలు పరుగెత్తుకొచ్చిన 10 ఏళ్ల చిన్నారి

అథ్లెట్ కావాలన్నా తన కలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కు లేక రాసింది కాజల్. చిన్నారి కాజల్ నుంచి లేక అందుకున్న సీఎం యోగి..బాలికకు ఆహ్వానం పంపారు

UP CM Yogi Adityanath: సీఎం యోగిని కలుసుకునేందుకు 200 కి.మీలు పరుగెత్తుకొచ్చిన 10 ఏళ్ల చిన్నారి

Yogi

UP CM Yogi Adityanath: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కిలో మీటర్లు పరుగెత్తుకొచ్చి తన అభిమాన ముఖ్యమంత్రిని కలుసుకుంది ఓ పదేళ్ల బాలిక. అథ్లెట్ గా గొప్ప విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న తపనతో చిన్న నాటి నుంచే కఠోర సాధన చేస్తున్న ఆ బాలిక పేరు కాజల్. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని మందా ప్రాంతంలో కాజల్ కుటుంబం నివసిస్తుంది. గతేడాది నవంబర్లో అలాహాబాద్ లో నిర్వహించిన ఇందిరా మారథాన్ లో పాల్గొన్న కాజల్..అప్పుడే క్రీడల్లో తన భవిష్యత్తును నిర్దేశించుకుంది. అథ్లెట్ కావాలన్నా తన కలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కు లేక రాసింది కాజల్. చిన్నారి కాజల్ నుంచి లేక అందుకున్న సీఎం యోగి..బాలికకు ఆహ్వానం పంపారు. తనను కలుసుకునేందుకు లక్నో రావాలంటూ సీఎం యోగి చిన్నారి కాజల్ కు ప్రత్యుత్తరం రాసారు.

Also read:Hubli Police station: అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై దాడి: 12 మంది స్టేషన్ సిబ్బందికి గాయాలు, 40 మంది అరెస్ట్

దీంతో ఏప్రిల్ 10న ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ నుంచి లక్నోకు 200 కిమీలు కాలినడకన బయలుదేరింది కాజల్. ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఏప్రిల్ 15న లక్నో చేరుకున్న చిన్నారి కాజల్..సీఎం కార్యాలయం నుంచి వచ్చే పిలుపు కోసం వేచి చూసింది. శనివారం(ఏప్రిల్ 16న) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకున్న కాజల్, తన లేఖపై వెంటనే స్పందించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ ఆమెను సన్మానించి అథ్లెటిక్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

Also read:Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా?

భవిష్యత్తులో చిన్నారి కాజల్ ఎన్నో విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న కాజల్ భవిష్యత్తులో దేశం గర్వించే అథ్లెట్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కాజల్ ప్రతిభను గుర్తించి లక్నోలోని బాబూ బనారసీ దాస్ స్పోర్ట్స్ అకాడమీ..క్రీడల్లో రాణించేందుకు జీవితాంతం ఆమెకు అవసరమైన స్పోర్ట్స్ కిట్ మరియు షూలను అందించే బాధ్యతను తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కాజల్ కు స్పోర్ట్స్ కిట్ ను బహుమతిగా ఇచ్చారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కాజల్ కృతజ్ఞతలు తెలిపింది.

Also read:Water Bottle: వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి