Hubli Police station: అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై దాడి: 12 మంది స్టేషన్ సిబ్బందికి గాయాలు, 40 మంది అరెస్ట్

అర్ధరాత్రి సమయంలో రాళ్లు, కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు

Hubli Police station: అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై దాడి: 12 మంది స్టేషన్ సిబ్బందికి గాయాలు, 40 మంది అరెస్ట్

Hubballi

Hubli Police station: కర్ణాటకలో మతపరమైన అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక పరమైన ఘర్షణలతో కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా అట్టుడుకుతోంది. శనివారం అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. దుండగులు..అర్ధరాత్రి సమయంలో రాళ్లు, కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో దుండగులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ ప్రయోగించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈఘటనలో మొత్తం 12 మంది పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై హుబ్లీ – ధార్వాడ్ పోలీస్ కమిషనర్ లాబు రామ్ మాట్లాడుతూ..స్టేషన్ పై దాడికి పాల్పడిన వారిలో 40 మందిని గుర్తించి.. అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కమిషనర్ లాబు రామ్ వెల్లడించారు.

Also read:Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

ఘర్షణకు గల కారణాలు వెల్లడిస్తూ..స్థానిక యువకుడొకరు ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్ట్ పెట్టడంతో అసలు గొడవ మొదలైంది. అభ్యంతరకర పోస్ట్ పెట్టిన ఆ యువకుడిపై సదరు సామాజికవర్గీయులు పోలీస్ కేసు నమోదు చేశారు. ఆమేరకు హుబ్లీ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ సంబంధిత సామాజికవర్గీయులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also read:PRE WEDDING SHOOT: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆసుపత్రిలో కొత్త జంట

యువకుడిపై పోలీసులు తీసుకున్న చర్యలు సరిపోవంటు అసంతృప్తితో రగిలిపోయిన వారు, అర్ధరాత్రి సమయంలో పోలీసు స్టేషన్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి, గందరగోళం సృష్టించారు. ఘటనపై కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ “దుండగుల దాడిలో ఒక పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగినట్లు హోంమంత్రి తెలిపారు.

Also read:Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్