Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్‌లు పెట్టి వేధిస్తున్నాడని...

Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

Jagga Reddy

Updated On : April 17, 2022 / 1:45 PM IST

Jagga reddy: గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్‌లు పెట్టి వేధిస్తున్నాడని, గతంలో అజయ్‌పై డీజీపీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నేను కలిసి ఫిర్యాదు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని అన్నారు. పువ్వాడ ఓ సైకో అని, కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, పువ్వాడకు కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

Jagga Reddy: రాజీనామాపై.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

ఇంత జరుగుతున్నా ఎస్పీ ఏం చేస్తున్నారని, పోలీసులపై విశ్వాసం పోకుండా చూడాలని జగ్గారెడ్డి కోరారు. మృతుడి కుటుంబాల నుండి పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వాంగ్మూలం తహసీల్దార్, పోలీస్ అధికారులు తీసుకోవాలని, కానీ మీడియా తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వాంగ్మూలం తీసుకోలేదంటేనే ఇది హత్యగా అర్థమవుతుందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అజయ్‌పై ఉన్న ఫిర్యాదులపై విచారణ చేయాలని, వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని అన్నారు.