Ice cream idly Video: ఇదేం టేస్ట్ రా నాయన: ఇడ్లీ సాంబార్ తో ఐస్ క్రీం రోల్స్

ఇడ్లీని ఐస్ రోలర్ బల్లపై పెట్టి పొడిపొడి చేశాడు. అనంతరం అందులో సాంబార్, కొబ్బరి చట్నీ వేసి పేస్ట్ లా తయారు చేశాడు.

Ice cream idly Video: ఇదేం టేస్ట్ రా నాయన: ఇడ్లీ సాంబార్ తో ఐస్ క్రీం రోల్స్

Idluy

Ice cream idly Video: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్టుగా..మన నాలుక ఎపుడు ఏం కోరుకుంటుందో చెప్పలేం. అందుకే రకరకాల వంటకాలపై ప్రయోగాలు చేస్తుంటారు ఆహార ప్రియులు. అయితే తినడానికి రుచికరంగా ఏ వంటైనా వండుకుని తింటే బాగుంటుంది కానీ లేనిపోని ప్రయోగాలు చేసి..ఇష్టమైన వంటలను సైతం పక్కనబెట్టేంతలా ప్రయోగాలు చేయకూడదు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు హోటల్, ఫుడ్ సెంటర్ నిర్వాహకులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇటీవల బెంగళూరులోని ఒక హోటల్లో పుల్లకు గుచ్చిన ఇడ్లీలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. చూడ్డానికి అచ్చు పుల్ల ఐస్ లానే ఉన్న ఆ ఇడ్లీలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీలోని ఒక ఐస్ క్రీం నిర్వాహకుడు మరో అడుగు ముందుకువేసి ఏకంగా ఇడ్లీ సాంబార్ తోనే ఐస్ క్రీం రోల్స్ తయారు చేశాడు.

Also read:Trees Translocation: 100 ఏళ్ల నాటి 4 చెట్లను యధావిధిగా తరలించిన మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు

“ది గ్రేట్ ఇండియన్ ఫుడీ” అనే ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ తెలిపిన వివరాలు మేరకు..ఢిల్లీలోని లజపత్ నగర్ సమీపంలోని అమర్ కాలనీలో ఉన్న ఐస్ క్రీం షాపు వాడు..వినియోగదారులను ఆకర్శించేందుకు ఇడ్లీ సాంబార్ తో ఐస్ క్రీం తయారు చేయడం మొదలెట్టాడు. ముందుగా ఇడ్లీని ఐస్ రోలర్ బల్లపై పెట్టి పొడిపొడి చేశాడు. అనంతరం అందులో సాంబార్, కొబ్బరి చట్నీ వేసి పేస్ట్ లా తయారు చేశాడు. అనంతరం అందులో ఐస్ క్రీం ఫ్లేవర్ వేసి ఐస్ రోలర్ బల్లపై గొట్టల్లాగా చుట్టలు చుట్టి తిరిగి దానిపై సాంబార్ పోసి వినియోగదారులకు సర్వ్ చేశారు.

Also read:kangana ranaut: అమితాబ్ లాంటి యాంగ్రీ యంగ్‌మ్యాన్ యశ్: కంగనా

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు, ఇడ్లీ ప్రియులు ఐస్ క్రీం షాప్ నిర్వాహకుడిపై మండిపడుతున్నారు. “ఇడ్లిని ఇలా నాశనం చేయాలనీ నీకు ఎందుకు అనిపించింది” అంటూ ఒకరు కామెంట్ చేస్తే..”జీవితంలో ఇంకోసారి ఇడ్లీ తినకుండా చేసావు” అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు. “సృజనాత్మకతను, రుచిని సర్వనాశనం చేశావు కదరా” అంటూ ఒకరంటే..”ఇక నిన్ను జీవితంలో క్షమించను పో” అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by thegreatindianfoodie (@thegreatindianfoodie)

Also read:UP CM Yogi Adityanath: సీఎం యోగిని కలుసుకునేందుకు 200 కి.మీలు పరుగెత్తుకొచ్చిన 10 ఏళ్ల చిన్నారి