kangana ranaut: అమితాబ్ లాంటి యాంగ్రీ యంగ్‌మ్యాన్ యశ్: కంగనా

గతంలో కంగనా పలు సందర్భాల్లో దక్షిణాది చిత్రాలను పొగుడుతూ వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై కూడా ప్రశంసలు కురిపించింది.

kangana ranaut: అమితాబ్ లాంటి యాంగ్రీ యంగ్‌మ్యాన్ యశ్: కంగనా

Kang

ఒకవైపు బాలీవుడ్‌ స్టార్స్‌పై విరుచుకుపడే నటి కంగనా రనౌత్.. మరోవైపు సౌత్ స్టార్స్‌పై ప్రశంసలు కురిపిస్తోంది. తాజాగా దక్షిణాది హీరోలను పొగుడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స్ షేర్ చేసింది. యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తోపాటు ‘కేజీఎఫ్’ హీరో యశ్‌ను పొగుడుతూ పోస్టు చేసింది. ఒక పోస్టులో యశ్‌ను అమితాబ్‌ బచ్చన్‌తో పోలుస్తూ పిక్చర్ షేర్ చేసింది. ‘‘కొన్ని దశాబ్దాలుగా యాంగ్రీ యంగ్ మ్యాన్‌ను ఇండియా మిస్సైంది. 1970లలో అమితాబ్ బచ్చన్ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడా స్థానాన్ని యశ్ భర్తీ చేశాడు. ఇది అద్భుతం’’ అంటూ కంగనా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 1970-80లలో అమితాబ్‌కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదు ఉన్న సంగతి తెలిసిందే.

Kangana Ranaut : మూవీ మాఫియా అంటూ అలియా సినిమాపై ఫైర్ అయిన కంగనా..

కంగనా మరో పోస్టు కూడా చేసింది. అందులో యశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్న పిక్చర్ కొలాజ్‌ను షేర్ చేసింది. ఈ పిక్చర్‌లో నలుగురు హీరోలు సంప్రదాయ దుస్తుల్లో, ట్రెడిషన్ ఫాలో అవుతూ కనిపించారు. ‘‘అపార ప్రతిభ, శ్రమ కలిగిన దక్షిణాది సూపర్ స్టార్స్ వినమ్రంగా ఉంటారు. వాళ్లు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తారు. అదే ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది’’ అంటూ ఆ పోస్టులో షేర్ చేసింది. అయితే, కంగనా దక్షిణాది సినిమా ఇండస్ట్రీని పొగడటం కొ్త్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో దక్షిణాది చిత్రాలను పొగుడుతూ వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై కూడా ప్రశంసలు కురిపించింది.