Punjab : ఢిల్లీ పర్యటన..మొన్న స్టాలిన్.. నేడు భగవంత్ మాన్

ప్రభుత్వంచే స్థాపించబడిన మొహల్లా క్లినిక్ లు 300 కంటే ఎక్కువగానే ఉన్నాయని, దీని వెబ్ సైట్ ప్రకారం.. వందలాది మంది అవసరమైన మందులు, పరీక్షలను...

Punjab : ఢిల్లీ పర్యటన..మొన్న స్టాలిన్.. నేడు భగవంత్ మాన్

Aap's Bhagwant Mann

CM Bhagwant Mann To Visit Delhi : దేశ రాజధాని ఢిల్లీకి నేతలు క్యూ కడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఢిల్లీకి విచ్చేస్తున్నారు. అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తున్నారు. స్కూళ్లలోని సౌకర్యాలు, మొహల్లా క్లినిక్స్ లలో అందుతున్న సౌకర్య ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఢిల్లీకి వచ్చేసిన సంగతి తెలిసిందే. మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా.. పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ఢిల్లీకి రానున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లు, మొహల్లా క్లినిక్ లను సందర్శించనున్నారు. ఆయనతో పాటు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా ఉండనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరవుతారని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

Read More : Raj Thackeray: చట్టం కంటే మతం పెద్దది కాదనే విషయాన్నీ ముస్లింలు గుర్తించాలన్నా రాజ్ థాకరే: మే 3 వరకు టార్గెట్

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి సారించింది. అందులో భాగంగా మొహల్లా క్లినిక్ లను ఏర్పాటు చేసింది. సాధారణ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను కేంద్రాలు అందించనున్నాయి. ప్రభుత్వంచే స్థాపించబడిన మొహల్లా క్లినిక్ లు 300 కంటే ఎక్కువగానే ఉన్నాయని, దీని వెబ్ సైట్ ప్రకారం.. వందలాది మంది అవసరమైన మందులు, పరీక్షలను అందిస్తోందని అంచనా. ఈనెల ఫస్ట్ వీక్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లు, మొహల్లా క్లినిక్ లను సందర్శించారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉన్నారు.

Read More : UP CM Yogi Adityanath: సీఎం యోగిని కలుసుకునేందుకు 200 కి.మీలు పరుగెత్తుకొచ్చిన 10 ఏళ్ల చిన్నారి

వెస్ట్ వినోద్ నగర్ లో ఉన్న రాజకీయ కన్యా సర్వోదయ విద్యాలయాన్ని సందర్శించారు. ఆప్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం కూడా మోడల్ స్కూళ్లను రూపొందిస్తోందని.. వాటిని సందర్శించాలని సీఎం కేజ్రీవాల్ ను సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఢిల్లీలో మోడల్స్ స్కూల్స్ ఎలా నిర్వహించబడుతున్నాయో…అలాగే తమిళనాడులో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత.. సీఎం కేజ్రీవాల్ ను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.