Tablighi Jamaat సభ్యుడు సూసైడ్

30 సంవత్సరాల వయస్సున్న తబ్లిగీ జమాత్ సభ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా అనారోగ్యం పెరుగుతుండటంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్టుటు చేయియంచుకున్నాడు. కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఉన్నట్టుండి శనివారం తెల్లవారు జామున గొంతును బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (లాక్ డౌన్ : మోడీకి సీఎం కేసీఆర్ ఏం చెప్పారు)
ఆ వ్యక్తి అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లిన తబ్లిగీ జమాత్ సభ్యుల్లో ఒకరని పోలీసులు వెల్లడించారు. మార్చి 6నుంచి 8తేదీల్లో వెళ్లి ఉండొచ్చని అంటున్నారు. లక్షణాలు కనిపించడంతో తనంతట తానే స్వయంగా హాస్పిటల్ కు వచ్చి అడ్మిట్ అయ్యాడు.
పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కింద కేసులు నమోదు చేసుకున్నారు. దీంతో శనివారం ఉదయానికి కొవిడ్ కేసులు 7వేల 447 చేరుకోగా మహారాష్ట్రలో వెయ్యి 574కు చేరుకున్నాయి.
ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనల అనంతరం ఇళ్లకు చేరుకున్న పలువురు తబ్లిగి జమాత్ సభ్యుల్లో కొందరు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా రహస్యంగా ఉంటున్నారు. లక్నోలోని మసీదులో ఉన్న పలువురు జమాత్ సభ్యులను గుర్తించి వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో మూడో వంతు కేసులు తబ్లిగీ జమాత్ కు హాజరైనవారివే.