బీజేపీపై అన్నాహజారే ఫైర్…పార్టీ రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు

బీజేపీపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ఫైర్ అయ్యారు. కళంకం కలిగిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని బీజేపీని అన్నాహజారే హెచ్చరించారు. హత్యలు,కిడ్నాప్ లు,రేప్ లు,ఆర్థికనేరాలకు పాల్పడుతున్న వారిని బీజేపీ చేర్చుకోకూడదని ఆయన అన్నారు. బీజేపీ కనుక ఇలాంటివాళ్లను చేర్చుకోవడం కొనసాగిస్తుంటే పార్టీ పరువు పొగోట్టుకోవడానికి చాలా కాలం పట్టదన్నారు.
కళంకం కలిగిన నాయకులు రాజకీయాల్లో కొనసాగకుండా ప్రజలే వారికి మొదట బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు. అలాంటి నాయకులను చేర్చుకుంటున్న పార్టీలకు ముఖ్యంగా యువత తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కళంకంల లేని,నిజంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్లను చట్టసభలకు పంపించాలన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది అవినీతిపరులైన నేతలు ఉన్నారన్నారు. ఇలాంటి నాయకులందరూ తమను తాము రక్షించుకునేందుకు అధికార పార్టీలో చేరి షెల్టర్ తీసుకుంటున్నారని అన్నారు. గ్రఖుల్ స్కామ్ లో నిందితుడిగా తేలిన శివసేన నాయకులు సురేష్ జైన్ దీనికి ఉదాహరణ అని హజారే అన్నారు. వేల కోట్ల రాపాయల విలువైన స్కామ్ ల నుంచి తను తప్పించుకునేందుకు మూడుసార్లు పార్టీలు మార్చాడని అన్నారు. అతనిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతుందన్నారు.