సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వని వధువు కావాలి..పెళ్లి ప్రకటన వైరల్

Tall, Slim Bride’ Not ‘Addicted To Social Media : పెళ్లి అంటే నూరేళ్ల పంట..అంతకంటే ముందు..పెళ్లి చూపులు నిర్వహిస్తుంటారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి..వారి కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవాలని ఇరువురు కుటుంబసభ్యులు ఆలోచిస్తుంటారు. కానీ..ప్రస్తుతం కాలం మారుతోంది. మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తమకు సరియైన వధువు/వరుడు కావాలని ప్రకటనలు ఇస్తున్నారు. ఇందుకు వివాహ వేదికలు సహాయం చేస్తున్నాయి. తమకు ఎలాంటి వారు కావాలో వారు స్పష్టంగా చెప్పుకోవచ్చు. నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ..ఓ వ్యక్తి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Nitin Sangwan, IAS అధికారి వధువు / వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ పేపర్‌లో వచ్చిన ఓ యాడ్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
ఆ ప్రకటనలో ఏముందంటే…వెస్ట్ బెంగాల్ కు చెందిన కమర్పూర్‌కు వ్యక్తి ‘చటర్జీ 37/5’7” యోగా ప్రాక్టీషనర్, అందంగా ఉంటాను. ఎలాంటి దురలవాట్లు లేవు,
హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇళ్లు, కట్నం అడగను. అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి. ప్రధానంగా..సోషల్ మీడియాకు బానిస కాకూడదు’ అంటూ ప్రకటన ఇచ్చాడు. తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.
Prospective brides/grooms please pay attention.
Match making criteria are changing ? pic.twitter.com/AJZ78ARrHZ
— Nitin Sangwan, IAS (@nitinsangwan) October 3, 2020