ఏడో తరగతి విద్యార్థినికి అశ్లీల వీడియోలు చూపించిన 3 స్కూల్ విద్యార్థులు.. పలు మార్లు రేప్

  • Published By: Subhan ,Published On : June 21, 2020 / 12:55 PM IST
ఏడో తరగతి విద్యార్థినికి అశ్లీల వీడియోలు చూపించిన 3 స్కూల్ విద్యార్థులు.. పలు మార్లు రేప్

Updated On : June 21, 2020 / 12:55 PM IST

ఏడో తరగతి చదువుతున్న 11ఏళ్ల విద్యార్థినికి అశ్లీల వీడియోలు చూపించి.. పలు మార్లు రేప్ చేశారు ముగ్గురు స్కూల్ విద్యార్థులు. తమిళనాడులోని కొయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. సెక్సువల్ దాడి కింద పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు శనివారం హాజరుపరిచారు. మూడో వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 

బాధితురాలైన గుడియా(పేరు మార్చారు) అనే బాలిక సుందరాపురం ప్రాంతంలో అద్దెకు ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఆమె తల్లి చనిపోవడంతో తండ్రి, పిన్నితో కలిసి ఉంటుంది. వారిద్దరూ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఇంటి ఓనర్ దగ్గరకు అప్పుడప్పుడు టీవీ చూడటానికి బాలిక వెళ్లేది. 

హౌజ్ ఓనర్ కు 16ఏళ్ల శర్మన్(పేరు మార్చారు) అనే కొడుకు ఉన్నాడు. ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదవుతున్నాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకునేవాడు. ఇటీవల ఆన్‌క్లాసుల కోసం ఓ మొబైల్ ఫోన్ కూడా అతనికి ఇచ్చారు. కునాల్(17) అనే మర ఫ్రెండ్ పలు మార్లు అతని ఇంటికి వస్తుండేవాడు.  

మే20న రోజూ లాగానే గుడియా టీవీ చూసేందుకు యజమాని ఇంటికి వచ్చింది. ఇంట్లోకి రాగానే ఆ ఇద్దరు బాలురు మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు గమనించింది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించేసరికి ఆ ఇద్దరు బలవంతంగా బాలికను వీడియోలు చూసేలా చేశారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే తన ఇంటికి వెళ్లిపోయింది.

ఆ ఇద్దరు మైనర్లు ఆమెను ఫాలో చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇద్దరు కలిసి పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత వాళ్లు మరో ఫ్రెండ్ ముఖేశ్ (పేరు మార్చారు)ను పిలిచారు. ఒకే స్కూల్ లో చదువుతున్న వీరంతా మళ్లీ అశ్లీల వీడియోలు చూపిస్తూ.. పలు మార్లు బాలిక ఇంటికి వచ్చి రేప్ చేశారు. విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. 

కొద్ది రోజుల క్రితం బాలికకు కడుపులో నొప్పి మొదలైంది. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పలు మార్లు ప్రశ్నించిన అనంతరం.. ఇంటి యజమాని కొడుకుతో పాటు ఇద్దరు స్నేహితులు తనపై చేసినదంతా బయటపెట్టింది. డాక్టర్ వారిపై మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శర్మన్, కునాల్ ను అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ముఖేశ్ అనే వ్యక్తి కోసం గాలిపు చర్యలు చేపట్టారు.