Tamil Nadu: థర్డ్ వేవ్‌కు ముందస్తు జాగ్రత్తగా వినాయకచవితి బహిరంగ సభలు రద్దు

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ గైడ్‌లైన్స్‌ను తాజాగా ఇష్యూ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రీసెంట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలను బట్టి అన్ని కార్యక్రమాలను..

Tamil Nadu: థర్డ్ వేవ్‌కు ముందస్తు జాగ్రత్తగా వినాయకచవితి బహిరంగ సభలు రద్దు

Tamilnadu Govt

Updated On : September 10, 2021 / 7:35 AM IST

Tamil Nadu: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ గైడ్‌లైన్స్‌ను తాజాగా ఇష్యూ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రీసెంట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలను బట్టి అన్ని రాజకీయ, కల్చరల్, ఆధ్మాత్మిక కార్యక్రమాలన్నీ అక్టోబర్ 31వరకూ నిషేదించారు. శుక్రవారం వినాయకచవితి కంటే ముందుగానే ఈ కొత్త రూల్స్ అనౌన్స్ చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందనే అభిప్రాయంతో సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని నిర్ణయించారు.

‘ప్రస్తుతం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా.. ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. పండుగలు, రాజకీయ, సామాజిక, కల్చరల్ కార్యక్రమాలపై నిబంధనలను కొనసాగిస్తాం. ఇటువంటి కార్యక్రమాలు సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉంది’ అని లేటెస్ట్ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

ప్రజలందరినీ పండుగలు ఇళ్ల వద్దనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పండుగల సందర్భంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో రద్దీగా లేకుండా చూడాలని చెప్పింది. బుధవారం నమోదైన కొవిడ్ కేసులు 1587గా ఉంటే.. 18మృతులు సంభవించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

కాకపోతే హోటల్స్ తో పాటు కలిపి ఉన్న బార్లు, క్లబ్ లు యథావిధిగా నిర్వహించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బీచ్ లు, పబ్లిక్ జూ, బొటానికల్ గార్డెన్స్ తిరిగి ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. స్విమ్మింగ్ పూల్స్ 50శాతం కెపాసిటీతో మాత్రమే ఓపెన్ చేయాలి. ఐటీ కంపెనీలు, మూవీ థియేటర్స్ 100శాతం కెపాసిటీతో రీ ఓపెన్ చేసుకోవచ్చు.