అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను : ఎంత ముద్దుగా ఉన్నాయో..!

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 05:29 AM IST
అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను : ఎంత ముద్దుగా ఉన్నాయో..!

Updated On : December 23, 2019 / 5:29 AM IST

చిట్టి పొట్టి జంతువులు..వాటిని చూస్తేనే ముద్దొస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అటువంటి అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ కన్ను పడింది. వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు.  బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు అరుదైన జంతుజాతులను తరలిస్తూ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. 

బ్యాంకాక్ నుంచి చెన్నై వచ్చిన సదరు వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. అతడి లగేజీలో కొన్ని బుట్టల్లో పలు అరుదైన జంతుజాతుల పిల్లలు ఉన్నాయి. అందులో వింతగా ఉన్న 12 కంగారూ పిల్లలు, 3 ప్రైరీ డాగ్స్, 1 ఎర్రని ఉడత పిల్ల, 5 అరుదైన జాతులకు చెందిన పిల్లలున్నాయి. అధికారులు వాటిని సీజ్ చేసి, తిరిగి బ్యాంకాక్ పంపించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.