Organ Donors : అవయవ దాతలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.

Organ Donors : అవయవ దాతలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Tamil Nadu Govt

Updated On : September 23, 2023 / 2:38 PM IST

CM MK Stalin : అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం  (Tamil Nadu Govt) కీలక నిర్ణయం తీసుకుంది.అవయవ దానం చేసినవారికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్ ( CM MK Stalin )ప్రకటించారు. అవయవదాన ప్రక్రియ ద్వారా వందలాదిమంది రోగులకు కొత్త జీవితాన్ని అందిస్తున్నామని తెలిపారు. అవయవ దానం (Organ Donors)లో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తెలిపారు. అవయవదానం వందలాది మందికి కొత్త జీవితాలను ఇస్తోందని తెలిపారు.

‘‘బాధాకరమైన పరిస్థితుల్లో తమ ఆత్మీయులను కోల్పోవాల్సి వస్తే వారి అవయవాలను దానం చేయటం ద్వారా ఎంతోమందికి కొత్త జీవితాలను ఇవ్వవచ్చని తెలిపారు. తమ ఆత్మీయుల (బ్రెయిన్ డెడ్ వంటి పరిస్థితుల్లో) అవయవ దానానికి ముందుకు వచ్చేవారి నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత తమిళనాడుకు సాధ్యమైంది’’అని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అటువంటి అవయవదానం చేసే రోగుల కుటుంబ సభ్యులకు సీఎం స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు.

తమ అవయవాలను దానం చేసే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారి త్యాగాలను పురస్కరించుకుని మరణానికి ముందు అవయవదాతల అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని తెలిపారు.