Pongal gift : శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. పొంగల్ గిఫ్ట్ కింద రూ.1000 నగదు ప్రోత్సాహకం.. ఎవరెవరు అర్హులు అంటే..?
పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు

Pongal gift
Pongal gift 2024 : తమిళనాడులోని రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, రేషన్ కార్డులు లేని వారు ఈ నగదు ప్రోత్సాహం అందుకునేందుకు అనర్హులుగా అందులో పేర్కొన్నారు.
కేవలం అర్హులైన, రేషన్ కార్డు ఉన్న వారికి రూ.వెయ్యి రూపాయలు అందించనున్నారు. జనవరి 15న పొంగల్ జరుపుకోనుండగా అతి త్వరలోనే ఈ నగదు ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నారు.
CBSE Exams : విద్యార్థులకు అలర్ట్.. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..
பொங்கல் பரிசுத் தொகுப்புடன் ரூ.1000 ரொக்கமும் வழங்கி இந்த இடர்மிகு சூழலிலும் இல்லந்தோறும் இன்பம் பொங்கிடத் துணை நிற்கிறது நமது #DravidianModel அரசு.
ஆட்சி அமைந்தது முதல்,
? மகளிருக்கான விடியல் பயணத் திட்டத்தின் மூலம் மாதம் 1000 ரூபாய் அளவுக்கு செலவில் மிச்சம்,
?காலை உணவுத்… pic.twitter.com/Ax1iYSov0J— M.K.Stalin (@mkstalin) January 5, 2024
పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్..
ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు పొంగల్ సందర్భంగా ఇప్పటికే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రకటించింది. ఇందులో కేజీ బియ్యం, కేజీ పంచదార, పలు రకాల ఐటమ్స్‌తో పాటు చెరకును కూడా ఇవ్వనున్నారు. ఈ గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు ధోతి, చీర కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అంతేకాదండోయ్ కలైంజర్ మగళిర్ పథకం కింద ప్రతీ నెల ఇచ్చే రూ.1000 నగదును పండుగకు ఐదు రోజుల ముందుగానే అంటే జనవరి 10 నుంచే చెల్లించనున్నట్లు తెలిపింది. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందువల్ల 1.15 కోట్ల మంది మహిళలు నేరుగా లబ్ది పొందనున్నట్లు తెలిపింది.