Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య చర్చలు?
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. అయితే కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలతో కలుపుకుని టీవీకేకి ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది.
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. తగిన బలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకి 59 సీట్లు, అన్నాడీఎంకేకి 47 సీట్లు వచ్చాయి. ఇక లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంఎల్ డీఎంకే కూటమిలోనే ఉన్నాయి. సీపీఎంకి 2 సీట్లు, సీపీఐకి 2 సీట్లు, ఐయూఎంఎల్ కి 2 సీట్లు ఉన్నాయి.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. అయితే కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలతో కలుపుకుని టీవీకేకి ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఇవాళ గవర్నర్ ని కలిసిన విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, తగిన బలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కి అనుమతి ఇవ్వలేదు గవర్నర్. దీంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం కూడా రద్దైంది. అదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తమిళ రాజకీయాల్లో హీట్ పెంచేశాయి.
Also Read: ఛ.. రజినీకాంత్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదే జరిగుంటే సీఎం అయ్యేవారా?
