Tamil Nadu Covid-19 : తమిళనాడులో కొత్తగా 7,427 పాజిటివ్.. 189 మరణాలు
తమిళనాడులో కరోనా లాక్ డౌన్ మరో వారం పాటు పొడిగించింది. మరికొన్ని ఆంక్షల సడలింపులతో జూన్ 28 వరకు లాక్ డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.

Tamil Nadu State Reports 7,427 New Cases, 189 Deaths In Covid 19 Unlock
Tamil Nadu Covid-19 Cases : తమిళనాడులో కరోనా లాక్ డౌన్ మరో వారం పాటు పొడిగించింది. మరికొన్ని ఆంక్షల సడలింపులతో జూన్ 28 వరకు లాక్ డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
సోమవారం కొత్తగా 7,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 189 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,29,924కు నమోదు కాగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 31,386కు చేరింది. ప్రస్తుతం 61,329 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
గత 24 గంటల్లో 15,281 మంది కరోనా రోగులు కోలుకున్నారు. కోలుకున్న వారి మొత్తం సంఖ్య 23,37,209కు చేరారు. ప్రజా రవాణా 50 ఆక్సుపెన్సీతో చెన్నై సహా తిరువలూర్, కాంచిపూరం, చెంగాపెట జిల్లాల్లో సర్వీసులు నడపనున్నారు.
ఆటోమొబైల్ షోరూంలు, సర్వీసు సెంటర్లు, క్రీడా సంబంధిత ట్రైనింగ్స్ నిర్వహించుకోవచ్చు. ఆదివారం నాటికి చెన్నైలో 2,262 యాక్టివ్ కేసులకు పడిపోయాయి. తమిళనాడులో 12శాతం మాత్రమే ఫుల్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది.