Tamilnadu : వయస్సు 26, చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్య 21, 21వ భార్య ఫిర్యాదుతో బయటపడ్డ యువకుడి బాగోతం

వయస్సు 26, చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్య 21, 21వ భార్య ఫిర్యాదుతో బయటపడింది నిత్యపెళ్లికొడుకు బాగోతం.

tamilnadu 26 year Man done 21 marriages

Tamilnadu : అమ్మాయిలు తక్కువైపోతున్నారు. దీంతో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. ‘సార్ నాకు పెళ్లికావట్లేదు మీరే నాకు ఓ అమ్మాయిని చూసి పెట్టండి’ అంటూ యువకులు (పెళ్లికాని ప్రసాదులు) ఏకంగా ఎమ్మెల్యేలకు..తహశీల్దారులకు, కలెక్టర్లకు లేఖలు రాస్తున్న పరిస్థితి. కానీ ఓ యువకుడు మాత్రం ఒకటీ కాదు రెండు కాదు పోనీ 10 కూడా కాదు ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు. సదరు నిత్యపెళ్లికొడుకు వయస్సు తాను చేసుకున్న పెళ్లిళ్ల లెక్కకు కాస్త తక్కువుంది అంతే..అతని వయస్సు 26, చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్య 21..! ఇక్కడ ఒక్క పెళ్లికే దిక్కులేదంటే నీకు అంతమంది ఎలా దొరకార్రా బాబూ అంటూ పెళ్లి కాని ప్రసాదులు తెగ ‘హాశ్చర్యపోతున్నారు’..!! ఓనీ నీ టాలెంట్ తగలెయ్యో అంటూ అవాక్కవుతున్నారు..!!

26 ఏళ్ల వయస్సు అంటే హా అప్పుడే ఉద్యోగం వచ్చిందా? అనే వయస్సు..కొంతమందికైతే ఇంకా చదువుకునే వయస్సే..కానీ తమిళనాడుకు చెందిన కార్తీక్ రాజు అనే 26 ఏళ్ల యువకుడు మాత్రం ఏకంగా పెళ్లిళ్లు చేసుకోవటానికే పుట్టినట్లు..అదేదో పెళ్లిళ్ల వ్రతం చేస్తున్నట్లుగా 26 ఏళ్లకే ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ పక్క 35 నుంచి 40 ఏళ్లు దాటిపోతున్నా ఎంతోమంది యువకులు పెళ్లిచేసుకోవటానికి ఒక్క పిల్ల కూడా దొరకటంలేదు. కానీ కార్తీక్ రాజు మాత్రం పెళ్లి మీద పెళ్లి చేసేసుకోవటం గురించి వింటే ఆశ్చర్యపోవాలా? ఇతగాడి ‘పెళ్లి టాలెంట్’కు దిమ్మతిరిగిపోవాలో అర్థం కావట్లేదు బ్రహ్మచారులకు..

Bachelors: అయ్యయ్యో.. అక్కడ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోయారంట!

తమిళనాడు తంజావూర్ జిల్లా రామనపూడికి చెందిన కార్తీక్ రాజా.. నిత్యపెళ్లికొడుకులా తయారయ్యాడు. ఇప్పటికే 21 పెళ్లిళ్లు చేసుకున్న ఈ పెళ్లిళ్ల రాజా మరోపెళ్లికి రెడీ అయ్యాడు. అంటే 22వ పెళ్లికి రెడీ అయ్యాడు. కానీ 21 భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో ఇతగాడి 22వ పెళ్లికి ఫుల్ స్టాప్ పడింది. గత మార్చి (2022)లో రాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్ రాజా. పెళ్లికి అమ్మాయి తరఫువారు ఏకంగా ఐదు ఎకరాల భూమి, లక్షన్నర నగదుతో పాటు భారీగా బంగారం కూడా ఇచ్చారు. పెళ్లి కూడా జరిగిపోయింది. కానీ ‘ఈ పెళ్లిళ్ల రాజా’ కాస్త కూడా ఆగలేకపోయాడు. పెళ్లి అయ్యిందో లేదో ఆడపెళ్లివారు ఇచ్చిన కట్నం మొత్తం పట్టుకుని రాజా జంప్ అయ్యాడు. కట్టుకున్న భర్త, ఇచ్చిన కట్నం.. కనిపించకపోయేసరికి 21 భార్య రాణి కంగారుపడిపోయింది. భర్తకు ఏమైందోనని ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Bride wanted :‘మాకు పెళ్లిళ్లు కావట్లేదు..వధువును వెదికి పెట్టండీ’తహసీల్దారుకు వినతిపత్రం

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజా కోసం వెతికాదు. ఎట్టకేలకు పట్టుకున్నారు. సదరు నిత్యపెళ్లికొడుకును పోలీసులుతమదైన శైలిలో విచారించేసరికి ఈ రాజాగారి వరుస పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. కార్తీక్ రాజా పెళ్లిళ్ల కథ చెబుతుంటే పోలీసులే షాక్ అయ్యారు. ఇక భార్య రాణి పరిస్థితి మామూలుగా లేదు. అలా కార్తీక్ రాజా రాణితో సహా ఇప్పటి వరకు 21 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు విచారణలో తేలింది.

కార్తీక్ రాజాకు డబ్బులంటే పిచ్చి. ఆ డబ్బులతో విలాసాలు చేయటం అంటే అంతకంటే ఎక్కువ పిచ్చి. బుద్దిమంతుడిలా నటిస్తూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్లుగా నమ్మిస్తూ 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వచ్చిన కట్నంతో ఉడాయిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ 21భార్య ఫిర్యాదుతో బండారం అంతా బయటపడింది. ఒక్కో అమ్మాయికి ఒక్కో పేరుతో పరిచయమై వరుసగా వివాహాలు చేసుకుంటూ ఆ డబ్బుతో ఉడాయిస్తూ విలాసాలు చేస్తూ మరో అమ్మాయికి వల వేస్తూ ఇలా లైఫ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ‘నిత్యపెళ్లికొడుకు’గుట్టు రట్టు అయ్యింది.

viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

పెళ్లయ్యాకా ఒక్క భార్యతోనూ కనీసం 5 నెలలు కూడా ఉండేవాడు కాదని పోలీసుల విచారణలో తేలింది. ఓ పెళ్లి జరిగిన తర్వాత ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి.. ఆ డబ్బులు అయిపోయాక మరో ఊరికి వెళ్లి ఇంకో అమ్మాయితో వివాహం చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. అలా కార్తీక్ రాజా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 21 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Maharashtra: పెళ్లి కావడంలేదని యువకులు వినూత్న నిరసన.. గుర్రాలపై వచ్చి ..

కానీ ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా..ఈ రాజాను చేసుకున్న ఎవ్వరు ఫిర్యాదు ఇవ్వకపోవటంతో ఈ పెళ్లిళ్ల పరంపర కొనసాగింది. ఆఖరికి 21 భార్య రాణి ఫిర్యాదుతో అన్ని పెళ్లిళ్లు బయటపడటంతో పాటు కార్తీక్ రాజా తకుముందు పెళ్లి చేసుకున్న 20 మంది భార్యలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిత్య పెళ్లికొడుకు కార్తిక్ రాజా వద్ద ప్రస్తుతం ఉన్న ఓ ఆడి కారు స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన డబ్బు అంతా విలాసాలకు ఖర్చుపెట్టేశఆడని గుర్తించారు పోలీసులు..

ఇల్లుంటేనే పెళ్లి : పెరుగుతున్న అమ్మాయిల రిక్వైర్ మెంట్..కాంప్రమైజ్ అవుతున్న అబ్బాయిలు