Maharashtra: పెళ్లి కావడంలేదని యువకులు వినూత్న నిరసన.. గుర్రాలపై వచ్చి ..

రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, దీనంతటికి లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటమేనని పెళ్లికాని యువకులు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలుచేయాలని, తద్వారా ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.

Maharashtra: పెళ్లి కావడంలేదని యువకులు వినూత్న నిరసన.. గుర్రాలపై వచ్చి ..

Gender Determination Act

Updated On : December 22, 2022 / 9:07 AM IST

Maharashtra: దేశంలో చాలా ప్రాంతాల్లో పెళ్లీడుకు వచ్చినప్పటికీ కొందరు యువకులకు పెళ్లిళ్లు కాని పరిస్థితి. ఉన్నత ఉద్యోగాలు ఉండీ, రెండు చేతులా సంపాదిస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వధువు దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితి మహారాష్ట్రలో కాస్త అధికంగానే ఉన్నట్లుంది. దీంతో పెళ్లీడుకొచ్చినా పెళ్లికాని యువకులు చాలా మంది తమ ఆవేదనను వినూత్న రీతిలో వెలుబుచ్చారు. మహారాష్ట్రంలోని షోలాపూర్ జిల్లాలో వింత ఉద్యమానికి అక్కడి పెళ్లికాని యువకులు తెరలేపారు. గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి తమ నిరసన తెలిపారు.

Shampoo Marriage Cancel : కొంపముంచిన షాంపూ.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్ అయ్యింది..!

మహారాష్ట్రలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, పెళ్లి చేసుకోవాలటే అమ్మాయిల కొరత ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెళ్లికాని యువకులు గుర్రాలపై వచ్చారు. గుర్రాలపై శోలాపుర్ పట్టణంలో ఊరేగింపుగా కలెక్టరేట్ కార్యాలయంకు వెళ్లి అక్కడే బైఠాయించి తమ నిరసన తెలిపారు.

Unmarried youths in Maharashtra are an innovative protest

Unmarried youths in Maharashtra are an innovative protest

రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, దీనంతటికి లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటమేనని వారు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలుచేయాలని, తద్వారా ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.