తమిళనాడులో రోడ్డు ప్రమాదం : చిన్నారితో సహా ఐదుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 06:46 AM IST
తమిళనాడులో రోడ్డు ప్రమాదం :  చిన్నారితో సహా ఐదుగురు మృతి

Updated On : April 30, 2019 / 6:46 AM IST

రోడ్డు ప్రమాదాలు వార్త వినని రోజంటు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదోక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఓ పసిపాప కూడా ఉంది. 

తమిళనాడులో ఏప్రిల్ 30 ఉదయం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరునెల్వేలి నుంచి టెంకాసి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలాంగులం అనే ప్రాంతం వద్ద తిరునెల్వేలి నుంచి టెంకాసికి వెళుతున్న లారీ, ఎదురుగా వస్తున్న కారును వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో రాజశేఖర్ (35) రాజశేఖర్ కుమార్తె తనిక  (3),పి. మురుగన్ (52) నిరంజన్ కుమార్ (28), నటరాజ్ మృతి చెందారు. లారీ డ్రైవర్ గణేశ్ కుమార్ (26)కు తీవ్ర గాయాలయ్యాయి. 
ఈ ప్రమాదంపై  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని తిరునల్వేలి మెడికల్ కాలేజ్ కు చెందిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.