మన ప్రధాని కోసం టాటా మోటార్స్ ‘టాటా గరుడా’ కారును తయారుచేయగలదా?

atmanirbhar limousine : భారతదేశంలో ఆత్మనిర్భార్ భారత్.. ఇప్పుడంతా #Vocalforlocal.. స్థానిక నినాదమే వినిపిస్తోంది. విదేశీ ఉత్పత్తులు వద్దు.. దేశీయ ఉత్పత్తులే ముద్దు అనేది స్థానికంగా బలపడుతోంది.
దేశీయంగా తయారైన ఉత్పత్తులనే వినియోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆత్మనిర్భార్ భారత్ ఆవిర్భావించింది.
అయితే, అమెరికా వంటి చాలా దేశాల ప్రధానులు, అధ్యక్షుల కోసం ప్రత్యేకించి భద్రతా వాహనాలను వినియోగిస్తున్నారు. విదేశీ ప్రధానులు, అధ్యక్షులు దేశీయంగా తయారైన కార్లనే వినియోగిస్తున్నారు.
మన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక భద్రత కాన్వాయ్ కోసం విదేశీ ఉత్పత్తులపై ఆధారపడాల్సి వస్తోంది. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా వంటి సొంత బ్రాండ్‌లు మనకు ఉన్నాయి.
అవసరమైతే మన స్వదేశీయ సంస్థలతో ‘ఆత్మనిర్భార్ లిమోసిన్’ (atmanirbhar limousine) వాహనాలను ప్రధాని కోసం తయారుచేయొచ్చు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షులు, రష్యా అధ్యక్షులు వల్దీమిర్ పుతిన్ ఎక్కడికి వెళ్లినా కూడా స్వదేశీంలో తయారైన అధ్యక్ష వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు.
అమెరికా అధ్యక్షులు జనరల్ మోటార్ కాడిల్లియక్ వన్ భద్రతా వాహనం అమెరికాలోనే తయారుచేశారు. పుతిన్ కూడా రష్యా తయారుచేసిన Aurus Senat అధ్యక్ష వాహనంలోనే ఎప్పుడూ ప్రయాణిస్తుంటారు.
https://10tv.in/indian-govt-bans-imported-goods-selling-at-army-canteens/
కానీ, మన ప్రధాని, రాష్ట్రపతులకు స్వదేశీయ కార్లు ఏమి లేవు.. ఎప్పుడైన ప్రధాని మోడీ రోడ్లపైకి వస్తే ఆయన కాన్వయ్ పై పెద్ద చర్చ అవుతోంది.
ప్రస్తుతం.. ప్రధాని మోడీ కాన్వయ్‌లో విదేశీ తయారీ కార్లే ఎక్కువగా ఉన్నాయి.
ప్రధాని కోసం కారును తయారు చేయమని ఇంతవరకు ఏ భారతీయ తయారీదారుని అడగలేదు. ట్రావెల్ కోసం మోడీ మొత్తం మూడు విభిన్న రకాల కాన్వాయ్ లను వాడుతున్నారు.
BMW-7 హైసెక్యూరిటీ కాన్వాయ్, ల్యాండ్ రోవర్ రేంజ్ కాన్వాయ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ కాన్వాయ్ ఉన్నాయి.
వాస్తవానికి.. టాటా గరుడా కారును NID విద్యార్థులు రూపొందించారు. నేషనల్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)కు చెందిన విద్యార్థులు కాన్సెప్ట్ స్కేల్ మోడల్‌ను డిజైన్ చేశారు. దీన్ని 2020 ఆటో ఎక్స్‌పో సమయంలో ప్రదర్శనకు ఉంచారు.
వాస్తవానికి ఇది టాటా మోటార్స్ అధికారిక కాన్సెప్ట్ కాదు.. టాప్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ కూడా ఒకప్పుడు NIDలో చదువుకున్న విద్యార్థిగా ఉన్నారు.
అలాగే, మన టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు భారత ప్రభుత్వం కోసం కస్టమైజడ్ కార్లను నిర్మించే సామర్థ్యం ఉంది.
టాటా, మహీంద్రాకు ప్రపంచ స్థాయి సాంకేతికత, జ్ఞానం ఉన్నాయి ఇప్పటికే రక్షణ ఆయుధ వాహనాలను తయారీలో, విదేశాలకు ఎగుమతి చేయడంలో రెండు కంపెనీలు కీలకంగా వ్యవహరించాయి.