Air India: ఎయిరిండియా కొత్త ఛైర్మన్‌గా చంద్రశేఖరన్
ఎయిరిండియాకు కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ను తీసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. సోమవారం అతని అపాయింట్మెంట్ ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Air India
Air India: ఎయిరిండియాకు కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ను తీసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. సోమవారం అతని అపాయింట్మెంట్ ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత ముందుగా టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమించింది.
ఆ అపాయింట్మెంట్ పై ఇండియా నుంచి ఒత్తిడి రావడంతో స్వతహాగా రాజీనామా చేసి వెళ్లిపోయారు.
టాటా సన్స్ ఛైర్మన్‌గా, 100 టాటా ఆపరేటింగ్ కంపెనీల ప్రమోటర్ గా చంద్రశేఖరన్ ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అక్టోబరు 2016లో టాటా సన్స్ బోర్డులో జాయిన్ ఆయనను జనవరి 2017లో ఛైర్మన్ గా అపాయింట్ అయ్యారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి కంపెనీలకు 2009-17 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్నారు.
Read Also: రెండు వారాలకే ఎయిరిండియా సీఈఓ జాబ్ వదిలేసిన ఇల్కర్ ఐసీ
టీసీఎస్ బిజినెస్ కెరీర్లో 30ఏళ్ల పాటు సేవలందించి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. లీడింగ్ గ్లోబల్ ఐటీ సొల్యూషన్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్ అయినటువంటి టీసీఎస్ కు సీఈఓ, మేనేజింగ్ డైరక్టర్ గా ఎదిగారు.