TCS Nashik Case : నాసిక్ TCS కేసులో విస్తుపోయే నిజాలు.. ‘చీర కట్టుకుంటే కౌగిలించుకున్నారు.. బురఖా ధరిస్తే అత్యాచారాలు జరగవు’
TCS Nashik Case : నాసిక్ టీసీఎస్ కేసు విచారణలో లోతుగా దర్యాప్తు చేస్తోన్న కొద్ది భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
TCS Nashik case update Victim gives harrowing details Rapes take place because women do not wear burqas
- టీసీఎస్ నాసిక్ కేసులో విస్తుపోయే వాస్తవాలు
- బురఖా ధరించాలని వేధింపులు
- చీర కట్టుకుంటే కౌగిలించుకున్నారు
TCS Nashik Case : మహారాష్ట్ర, నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో మత మార్పిడి ఒత్తిళ్లు, లైంగిక వేధింపుల కేసులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ నిందితులు బాధితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో వెలుగులోకి వస్తోంది. బాధితురాళ్లు పోలీసుల విచారణలో తాము ఎదుర్కొన్న దారుణాలను వెల్లడిస్తున్నారు. నిందితులు హిందూ మతంతో పాటు, హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాక.. తమతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవారని బాధితులు వెల్లడించారు. అంతేకాక తమను బురఖా ధరించాలని ఒత్తిడి చేసేవారని తెలిపారు.
పోయిన సంవత్సరం వివాహం చేసుకొని టీసీఎస్‌లో చేరిన ఓ బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు.. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కడుతున్నాయి. ట్రైనింగ్ సమయంలో షారుక్ ఖురేషి అనే ట్రైనింగ్ లీడర్‌తో పాటు మరో డిపార్ట్మెంట్కు చెందిన రజా మేమన్ అనే వ్యక్తి ఇద్దరూ కలిసి తనతో అసభ్యంగా మాట్లాడేవారని.. తన శరీరం గురించి, వైవాహిక జీవితం గురించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసేవారని బాధితురాలు వెల్లడించింది.
ఆఫీసులో మాత్రమే కాక క్యాంటీన్లో కూడా తన పక్కనే కూర్చొని అసభ్యకరంగా తాకేవారని.. తనలాంటి వారంతా బురఖా ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని తనను విమర్శించేవారని వెల్లడించింది. అంతటితో ఆగక.. తనను కూడా బురఖా ధరించాలని ఒత్తిడి చేసేవారని చెప్పుకొచ్చింది. ఉగాది (గుడి పడ్వా) రోజు చీర కట్టుకుని ఆఫీసుకు వచ్చినప్పుడు తనను బలవంతంగా కౌగిలించుకొనే ప్రయత్నం చేశారని కన్నీటిపర్యంతం అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నీదా ఖాన్ అనే ఉద్యోగిని తాను 2 నెలల గర్భిణిని అని.. ఈ కారణంతో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసింది. కానీ నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు కార్పొరేట్ వరల్డ్‌లో సంచలనంగా నిలిచింది.
