Karnataka : మహిళా టీచర్ నిర్వాకం.. స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోటో షూట్.. వైరల్

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే వెర్రి వేషాలు వేస్తే? కర్నాటకలో ఓ టీచర్ స్టూడెంట్‌తో చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Karnataka  : మహిళా టీచర్ నిర్వాకం.. స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోటో షూట్.. వైరల్

Karnataka

Updated On : December 29, 2023 / 4:56 PM IST

Karnataka : కర్నాటకలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి నిర్వాకం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఓ విద్యార్ధితో కలిసి ఆమె చేసిన ఫోటో షూట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఉపాధ్యాయురాలి తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్ధి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video : బాబోయ్.. కారు టాప్ మీద నిద్రపోతూ కనిపించిన చిన్నారులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

విద్యార్ధులు తప్పు చేస్తే మందలించాల్సిన టీచర్ తప్పు చేస్తే? అలాంటిదో ఓ సంఘటన కర్నాటకలో జరిగింది. డెక్కన్ హెరాల్డ్ ప్రకారం మురుగమల్లా చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు 10వ తరగతి విద్యార్ధి కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. @satya_AmitSingh అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోలను షేర్ చేసారు. ‘సమాజంలో మనం ఎటువైపు వెళ్తున్నాం? కర్నాటకలోని మురుగమల్లా చిక్కబళ్లాపూర్ జిల్లాలో 10వ తరగతి విద్యార్ధితో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రొమాంటిక్ ఫోటో షూట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి’ అనే శీర్షికతో వీటిని షేర్ చేసారు.

Hyderabad : శామీర్‌పేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగలు దోపిడీచేస్తున్న వీడియో వైరల్

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్ధి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే ఈ ఘటనపై స్పందిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.