Deepak Kumar Uprariya : చంద్రయాన్-3 కి పనిచేసిన టెక్నీషియన్ ఇడ్లీలు అమ్ముకుంటున్నారు..కారణం ఏంటంటే?

చంద్రయాన్-3 లాంచ్ ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉప్రారియా రోడ్ సైడ్ ఇడ్లీలు విక్రయిస్తున్నారు. అసలు అతనికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చదవండి.

Deepak Kumar Uprariya : చంద్రయాన్-3 కి పనిచేసిన టెక్నీషియన్ ఇడ్లీలు అమ్ముకుంటున్నారు..కారణం ఏంటంటే?

Deepak Kumar Uprariya

Updated On : September 19, 2023 / 2:59 PM IST

Deepak Kumar Uprariya : చంద్రయాన్-3 లాంచ్ ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలో రోడ్డు పక్కన ఇడ్లీలు విక్రయిస్తున్నారు. అసలు అతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

Water On Moon : చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్ -1 డేటా సేకరణతో సంచలన విషయాలు వెలుగులోకి!

దీపక్ కుమార్ ఉప్రారియా చంద్రయాన్-3 లాంచ్ ప్యాడ్ నిర్మాణంలో పనిచేసారు. ఆయన HEC (హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) లో సాంకేతిక నిపుణుడు. ఈ ప్రయోగంలో HEC- గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ (CPSU) ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్,  స్లైడింగ్ డోర్లను తయారు చేసాయి. అయితే దీపక్ పనిచేసిన HEC కంపెనీ 18 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆయన రోడ్ సైడ్ స్టాల్‌ను తెరవాల్సి వచ్చింది. HEC లో దాదాపుగా 2,800 మందికి జీతాలు అందలేదని తెలుస్తోంది.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన వేళ ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్ మిషన్ లాంచ్ ప్యాడ్ కార్మికులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. ఆ సమయంలో రాంచీలోని HEC ఉద్యోగులు తమ 18 నెలల జీతాల బకాయిలపై నిరసన గళం వినిపించారు. జీతాలు అందని వారిలో దీపక్ కూడా ఉన్నారు. ఉప్రారియా కొన్ని రోజులుగా ఇంటి అవసరాలను తీర్చడానికి ఇడ్లీలను విక్రయిస్తున్నానని ఉదయం ఇడ్లీలు అమ్మి, మధ్యాహ్నం ఆఫీసుకి వెళ్తున్నానని మీడియాకు చెప్పారు. కొంతకాలంగా క్రెడిట్ కార్డులు, ఆ తరువాత బంధువుల దగ్గర అప్పులు చేసి ఇంటిని నెట్టుకొచ్చినా ఇల్లు గడవడం కష్టం కావడంతో ఇడ్లీలు అమ్ముతున్నానని ఆయన తెలిపారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండర్‌ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో

దీపక్ కుమార్ ఉప్రారియా మధ్యప్రదేశ్‌లోని హర్దాకు చెందినవారు. 2012 లో రూ.8000 జీతంతో HEC లో చేరారు. గుర్తింపు వస్తుందనుకున్న తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని దీపక్ వాపోతున్నారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల స్కూలు ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారట. దీపక్ లాగ HEC నుంచి జీతం అందని వారంతా ఇలా ఏదో ఒక జీవనోపాధి వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది.