Ram Mandir : రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం ఎప్పుడో తెలుసా? ఆలయ ట్రస్ట్ ఏం చెప్పిందంటే

రామాలయం ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెందో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

Ram Mandir : రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం ఎప్పుడో తెలుసా? ఆలయ ట్రస్ట్ ఏం చెప్పిందంటే

Ram Mandir Construction

Updated On : January 30, 2024 / 10:07 PM IST

Ram Mandir Ayodhya : అయోధ్య రామ మందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు హాజరయ్యారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. మరుసటిరోజు నుంచి ఆలయంలో శ్రీరాముడి దర్శనంకోసం సాధారణ భక్తులను అనుమతించారు. అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇదిలాఉంటే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 14న రామాలయంలో బసంత్ పంచమిని జరుపుకోవాలని ప్రకటించడంతో ఫిబ్రవరి 15 నుంచి ఆలయం సముదాయంలో నిర్మాణ పనులను పున: ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read : Ram Mandir Darshan: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. రెండోరోజూ బాలరాముడి దర్శనంకోసం బారులు.. వీడియోలు వైరల్

రామాలయం ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెండో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. జనవరి 15 నుంచి రామజన్మభూమి కాంప్లెక్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు ప్రాణ్ ప్రతిష్ట వేడుకల కారణంగా నిలిపివేయడం జరిగింది. అయితే, తిరిగి ఫిబ్రవరి 15 నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే ప్రక్రియ మొదలుకానుంది. ఆలయ సముదాయంలో అమర్చిన యంత్రాలను తిరిగి అమర్చే పని ప్రారంమైందని రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న మార్బుల్ నిపుణుడు, ప్రధాన విక్రేత రోహిత్ భాటియా తెలిపారు.

Also Read : Ram Mandir Road Trip Guide : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్తున్నారా? రోడ్డుమార్గంలో ఎలా చేరుకోవాలంటే? రోడ్ ట్రిప్ గైడ్ ఇదిగో..!

మరోవైపు ఆలయ ట్రస్ట్ సంవత్సరంలో 12 ముఖ్యమైన తేదీలలో ఆలయ ప్రాంగణంలో జరుపుకునే పండుగల జాబితాను సిద్ధం చేసింది. ఆలయంలో బసంత్ పంచమ, రామ నవమి, సీతా నవమి, నరసింహ జయంతి, సావన్ ఝల ఉత్సవ్, జన్మాష్టమి, విజయదశమి, శరద్ పూర్ణిమ, దీపావళి పండుగలను ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.