Kashmir : సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు.. ఓ వ్యక్తి మృతి

కశ్మీర్‌లో సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ప్రజలపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు హరిస్తున్నారు.

Kashmir : సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు.. ఓ వ్యక్తి మృతి

Kashmir

Updated On : October 24, 2021 / 1:27 PM IST

Kashmir : కశ్మీర్‌లో సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ప్రజలపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు హరిస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.. దీంతో సాధారణ పౌరుడు అక్కడిక్కకడే మృతి చెందాడు. ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇక తాజాగా జరిగిన ఘటనతో ఇప్పటివరకు 11 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు బీహార్ కూలీలు ఉండగా.. మరో ఇద్దరు టీచర్లు, ఒక వ్యాపారి ఉన్నారు.

చదవండి : Kashmir : ఉగ్రదాడిలో ఆర్మీ అధికారి.. జవాన్ వీరమరణం

కశ్మీర్‌లో ఉగ్రవాదులను భద్రతా బలగాలు అణచివేస్తుండటంతో సాధరణ పౌరులే లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజా ఘటన కూడా ఉగ్రవాదుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడినవారికోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మెంధార్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులుతోపాటు మరో జవాన్ గాయపడ్డారు. ఉగ్రవాదులు నక్కివున్నారనే సమాచారంతో వెళ్లిన భద్రతాదళాలపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. టెర్రరిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చదవండి : Kashmir Civilian Killings : కశ్మీర్ లో పౌరుల హత్యలపై NIA దర్యాప్తు!