Traffic Cop Controversy: ట్రాఫిక్ పోలీసుపై వీరంగం.. రోడ్డు మీదే కొడతానని మొదలుపెట్టి స్టేషన్లో ఏడుస్తూ..

బెదిరింపుతో మొదలుపెట్టాడు.. బతిమాలుకుంటూ కూర్చున్నాడు. ప్రభుత్వాధికారిపై జులుం చూపించాలని ప్రయత్నించిన వ్యక్తి ఒక్కసారిగా మాట మార్చాడు. 'నిన్ను ఇక్కడే రోడ్ మీద కొడతాతో మొదలుపెట్టి సార్ తప్పు అయిపోయింది' అనేంత వరకూ జరిగింది సీన్.

Traffic Cop Controversy: ట్రాఫిక్ పోలీసుపై వీరంగం.. రోడ్డు మీదే కొడతానని మొదలుపెట్టి స్టేషన్లో ఏడుస్తూ..

Traffic Cop Cotroversy

Updated On : July 10, 2021 / 8:01 AM IST

Traffic Cop Controversy: బెదిరింపుతో మొదలుపెట్టాడు.. బతిమాలుకుంటూ కూర్చున్నాడు. ప్రభుత్వాధికారిపై జులుం చూపించాలని ప్రయత్నించిన వ్యక్తి ఒక్కసారిగా మాట మార్చాడు. ‘నిన్ను ఇక్కడే రోడ్ మీద కొడతాతో మొదలుపెట్టి సార్ తప్పు అయిపోయింది’ అనేంత వరకూ జరిగింది సీన్.

ట్రాఫిక్ పోలీస్ ను వేధించినందుకు సెల్ఫ్ రియలైజ్ అయి కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా తన రెడ్ కలర్ కారు మార్కెట్ ఏరియాలో పార్క్ చేయడంతో మొదలైంది. తప్పుడు పార్కింగ్ పై ట్రాఫిక్ పోలీస్ వార్నింగ్ ఇచ్చి కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

అంతే ఇక రెచ్చిపోయాడా వ్యక్తి. అతనితో పాటు ఉన్న మహిళ కూడా కాస్త మాటలు యాడ్ చేయడంతో వాదనకు అగ్గి రాజుకున్నట్లయింది. కారును లాక్కెళ్లడానికి నీకేం హక్కు ఉంది. ఇదేమైనా నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా.. అని ప్రశ్నించగా.. పక్కనే ఉన్న మహిళ నిన్ను అమ్మేసి కార్ రిపైర్ చేయించుకుంటా అని ఆజ్యం పోసింది.

నిన్ను ఇక్కడే కొడతా. నీ యూనిఫామ్ తీయ్. ఐదు నిమిషాల్లో తీసెయ్. ఇదంతా నీ యూనిఫామ్ పవర్. దాన్ని తగ్గిస్తే కానీ దారిలోకి రావు. అంటూ చెలరేగిపోయిన వ్యక్తి.. కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ‘ఇలా నేను చేసి ఉండాల్సింది కాదు. తప్పు చేశాను. ఐ యామ్ సారీ’ అంటూ రియలైజ్ అయిపోయాడు.

రిపోర్టుల ప్రకారం.. మహిళతో పాటు అతనిపై ట్రాఫిక్ అధికారి పట్ల తప్పుడు ప్రవర్తన కింద కేసు బుక్ చేశారు.