Same Gender Marriage: స్వలింగ వివాహాలపై కేంద్రానికి మళ్లీ మళ్లీ అదే మాట

ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పి.ఎస్.నరసింహలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది

Same Gender Marriage: స్వలింగ వివాహాలపై కేంద్రానికి మళ్లీ మళ్లీ అదే మాట

supreme court

Updated On : April 27, 2023 / 1:22 PM IST

Same Gender Marriage: స్వలింగ వివాహాలపై దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కొద్ది రోజులుగా వరుస విచారణ చేస్తోంది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం పాత విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై విచారణ వద్దని, ఈ అంశాన్ని పార్లమెంటుకు విడిచిపెట్టాలని బుధవారం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

West Bengal : భార్య చేసిన పనికి తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ క్లాస్‌రూమ్‌లో హల్‌చల్

ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పి.ఎస్.నరసింహలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఐదోరోజు విచారణలో భాగంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. స్వలింగ వివాహాలు చాలా సంక్షిష్ట అంశమని, సమాజంపై ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అన్నారు.

Karnataka polls: అల్లర్లంటూ వ్యాఖ్యానించి అమిత్ షా.. బెంగళూరులో కేసు నమోదు చేసిన కాంగ్రెస్

ఇతర దేశాల్లో పరిస్థితులను మన దేశానికి అన్వయించడం సరైంది కాదని, ఏ రెండు రాజ్యాంగాలూ ఒకే రకంగా లేవని పేర్కొన్నారు. అంతింమగా సామాజిక ఆమోదయోగ్యతే వివాహాలకు ప్రధానమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.