Karnataka polls: అల్లర్లంటూ వ్యాఖ్యానించిన అమిత్ షా.. బెంగళూరులో కేసు పెట్టిన కాంగ్రెస్

డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బూటకపు, తప్పుడు ప్రకటనలకు దిగుతున్నారు

Karnataka polls: అల్లర్లంటూ వ్యాఖ్యానించిన అమిత్ షా.. బెంగళూరులో కేసు పెట్టిన కాంగ్రెస్

FIR against Amit Shah for his riots remark

Karnataka polls: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద కాంగ్రెస్ పార్టీ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు రణ్‭దీప్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ గురువారం బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారని, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కల్పించేలా రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Bad Breath : నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుందా? దీన్ని వదిలించుకునేందుకు చిట్కాలు ఇవిగో !

బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అల్లర్లు జరుగుతాయని అన్నారు. దీనిపైనే కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు నమోదు చేసింది. ‘‘చట్ట ప్రకారం అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇవే వ్యాఖ్యలు సాధారణ వ్యక్తం చేసుంటే ఈ పాటీకి కఠిన చర్యలు తీసుకునే వారు. ఆయన (అమిత్ షా)ను వెంటనే అరెస్ట్ చేయాలి. కేంద్ర హోంమంత్రి ఆయన. శాంతిభద్రతల బాధ్యత ఆయనది. అలాంటి వ్యక్తి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లా మాట్లాడుతున్నారు’’ అని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anand Mohan: గ్యాంగ్‭స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

ఈ విషయమై 20 కేసులు నమోదు చేసినట్లు డీకే తెలిపారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని, అయితే వీలైనంత తొందర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బూటకపు, తప్పుడు ప్రకటనలకు దిగుతున్నారు’’ అని రణ్‭దీప్ సూర్జేవాలా అన్నారు.