Anand Mohan: గ్యాంగ్‭స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

ఆనంద్ మోహన్‌ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్‌పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.

Anand Mohan: గ్యాంగ్‭స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

Anand Mohan

Anand Mohan: 1995లో మాజీ ఐఏఎస్ జి.కృష్ణయ్యను కిరాతకంగా హత్య చేసిన కేసుతో పాటు అనేక కరుడుగట్టిన నేరాల్లో నిందితుడైన గ్యాంగ్‭స్టర్ కమ్ పొలిటీషియన్ ఆనంద్ మోహన్ గురువారం ఉదయమే జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయన విడుదల కావడానికి బిహార్ ప్రభుత్వం ఏకంగా చట్ట సవరణే చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనంద్ మోహన్ విడుదల కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నితీశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి చట్ట సవరణ చేసినప్పటి నుంచే బిహార్ ప్రభుత్వం విమర్శల్లో చిక్కుకుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవేవీ పట్టించుకోవడం లేదు.

Parkash Singh Badal: అంత్యక్రియల కోసం స్వగ్రామానికి బాదల్ భౌతికకాయం

ఆనంద్ మోహన్‌ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్‌పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది. అయితే ఆనంద్ మోహన్ విడుదల పట్ల మాజీ ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య భార్య ఉమా దేవి తీవ్ర ఆందోనళ వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని, అతడిని తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

Hyderabad Students: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు మృతి

‘‘ఆనంద్ మోహన్‌ను తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసనలు చేపట్టనున్నారు. అతడిని విడుదల చేయడం తప్పుడు నిర్ణయం. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి ప్రోత్సహించకూడదు. భవిష్యత్తులో ఆయన (ఆనంద్‌మోహన్‌) ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆయనను బహిష్కరించాలి. అతన్ని (ఆనంద్ మోహన్) తిరిగి జైలుకు పంపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఉమా దేవి అన్నారు. జి కృష్ణయ్య హత్య కేసులో దోషుల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.